ఎటువంటి విగ్రహాలను పూజించాలి ?

Last Updated : Oct 18, 2017, 02:37 PM IST
ఎటువంటి విగ్రహాలను పూజించాలి ?

మనము వివిధ రకాల లోహాలతో తయారుచేసిన విగ్రహాలను చూస్తుంటాము. బంగారం, వెండి, కంచు లోహాలు వాటిలో ప్రధానమైనవి. అలానే మార్కెట్లో మట్టి, చెక్క విగ్రహాలు కూడా అమ్ముతుంటారు. మరి వీటిని పూజకు ఉపయోగించవచ్చా?  ఎటువంటి లోహాలతో తయారుచేసిన విగ్రహాలను పూజ గదిలో ఉపయోగించాలి ? 

చెక్క, మట్టి విగ్రహాలను నిత్యపూజకు ఉపయోగించరాదు. మరి మట్టి విగ్రహాలకు దసరా, వినాయ చవితి, నవరాత్రుల్లో పూజ చేస్తాము కదా అని అనుకోవచ్చు. కానీ, వాటిని పండుగ తరువాత నిమర్జనం చేస్తాము కదా! అదీకాక మట్టి విగ్రహాలకు పగుళ్లు వస్తాయి. అందుకే బంగారం,  వెండి, కంచు విగ్రహాలను పూజ గదిలో ఉంచుకోవాలి. స్పటిక విగ్రహాలను పూజించేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉగ్ర రూపం, తేజస్సు, భయపెట్టే విగ్రహాలు ఉంటే పూజ సమయంలో దృష్టి విగ్రహం మీదపడి ప్రశాంతతను కోల్పోతారు. అభయ హస్తంతో ఆశీర్వదిస్తూ ఉండే విగ్రహాలను పూజిస్తే దృష్టి మారదు.. ప్రశాంతత, ధైర్యం లభిస్తుంది. 

Trending News