White Hair Problem Solution: ప్రస్తుతం 25 నుంచి 30 ఏళ్లవారికి జుట్టు నెరిసిపోవడం, జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు చాలా ఉన్నప్పటికీ అందులో జన్యుపరమైన, అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తినడమేనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా కొన్ని ప్రత్యేక హోం రెమెడీస్‌ను వినియోగించాల్సి ఉంటుంది. వీటిని వినియోగించడం వల్ల సులభంగా శాశ్వతంగా ఉపశమనం పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఏ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
వీటితో సులభంగా తెల్ల జుట్టు సమస్యలకు చెక్:
1. ఉల్లిపాయ:
ఆహారాలు రుచికరంగా ఉండడానికి తప్పకుండా ఉల్లిపాయను వినియోగించాల్సిందే. వాటిని ఆహారాల్లో వినియోగించడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గడమేకాకుండా తెల్ల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఉల్లిపాయలను మిశ్రమంగా తయారు చేసుకుని జుట్టు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇలా అప్లై చేసిన 30 నిమిషాల తర్వాత జుట్టును శుభ్రం చేసుకుంటే సులభంగా మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
2. ఆవు పాలు:
ఆవు పాల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలను కలిగిస్తాయో అందరికీ తెలిసిందే. ఇందులో ఉండే పోషక విలువలు శరీరానికే కాకుండా తీవ్ర జుట్టు సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అయితే దీని కోసం ఆవు పాలను జుట్టుకు ప్రతి రోజు అప్లై చేయాల్సి ఉంటుంది.
Also Read: Agent Twitter Review : ఏజెంట్ ట్విట్టర్ రివ్యూ.. హిట్ కొట్టిన అయ్యగారు
3. బ్లాక్ పెప్పర్:
ఆహారంలో రుచిని పెంచడానికి బ్లాక్ పెప్పర్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే గుణాలు జుట్టు నల్లగా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా జుట్టు రాలడాన్ని కూడా సులభంగా నియంత్రిస్తుంది. కాబట్టి తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు నీటిలో బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసి జుట్టుకు పట్టించాల్సి ఉంటుంది.
4. అలోవెరా జెల్:
అలోవెరా జెల్లో ఉండే గుణాలు తెల్ల జుట్టును తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు చర్మ సౌందర్యాన్ని పెంచడానికి కూడా సహాయపడుతుంది. తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు అలోవెరా జెల్‌ను నిమ్మరసంలో కలిపి పేస్ట్‌ను తయారు చేసి జుట్టుకు అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన 30 నిమిషాల తర్వాత జుట్టును శుభ్రం చేయాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Agent Twitter Review : ఏజెంట్ ట్విట్టర్ రివ్యూ.. హిట్ కొట్టిన అయ్యగారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook