White Hair Treatment: తెల్ల జుట్టును నల్లగా మార్చేందుకు ఈ ఇంటి చిట్కాలను పాటించండి!

White Hair Treatment: ప్రస్తుతం యువత నుంచి ముసలి వాళ్ల వరకు ఎంతో మంది తెల్లజుట్టు సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో చాలా మంది హెయిర్ క్రీమ్ వాడుతున్నారు. దీని కారణంగా చాలా మంది సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడుతున్నారు. అయితే నేచురల్ గా తెల్ల జుట్టు నల్లగా మారేందుకు పాటించాల్సిన చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 2, 2022, 11:00 AM IST
    • చిన్న వయసులోనే తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?
    • అయితే ఈ ఇంటి చిట్కాను పాటించి.. తెల్ల జుట్టును నల్లగా మార్చుకోండి!
White Hair Treatment: తెల్ల జుట్టును నల్లగా మార్చేందుకు ఈ ఇంటి చిట్కాలను పాటించండి!

White Hair Treatment: మారుతున్న కాలాలు, ఆహారపు అలవాట్ల కారణంగా జుట్టుపై ప్రభావం పడుతుంది. దీంతో జుట్టు బలహీనంగా మారడం సహా చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే ప్రస్తుతం కాలంలో చాలా మంది జుట్టుకు రంగును వేసుకుంటున్నారు. దీని వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ గురయ్యే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే నేచురల్ గా జుట్టు నల్లగా మారాలంటే కొన్ని ఆరోగ్య చిట్కాలు పాటించాలి. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం. 

జుట్టు నల్లబడటానికి ఈ నూనె వాడండి!

ఇనుప కళాయిలో 200 మిల్లీ లీటర్ల ఆవాల నూనె మీడియం ఫ్లేమ్ మీద వేడి చేయాలి. అందులో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల హెర్బల్ డ్రై మెహందీ పౌడర్ ను యాడ్ చేయాలి. ఆ మిశ్రమాన్ని బాగా తిప్పుతూ వేడి చేయాలి. తక్కువ మంటపై మరిగించి, మిశ్రమం ముద్దగా కాకుండా జాగ్రత్త వహించాలి. ఇప్పుడు ఓ టేబుల్ స్పూన్ ఉసిరి కాయ పొడిని కలపాలి. ఆ తర్వాత ఒకటిన్నర లేదా రెండు టేబుల్ స్పూన్స్ మెంతిపొడి యాడ్ చేయాలి. 

ఈ మిశ్రమం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంటపై ఉంచాలి. ఈ ప్రక్రియ దాదాపుగా 7 నుంచి 8 నిమిషాల సమయం పడుతుంది. అయితే ఈ మిశ్రమాన్ని నిరంతరం తిప్పుతూ ఉండాలి. గోధుమరంగులో మారిన తర్వాత ఈ మిశ్రమం చల్లార్చాలి. ఆ తర్వాత 12 నుంచి 24 గంటల పాటు దీనిపై మూత పెట్టాలి. ఇలా చేయడం వల్ల ద్రావణం చిక్కగా మారుతుంది. 

చల్లార్చి జుట్టు కుదుళ్ల నుంచి అప్లే చేయాలి. అది జుట్టును దృఢంగా ఉంచడం సహా మెరుపును అందించేందుకు సహాయం చేస్తుంది.  దీంతో పాటు తెల్ల జుట్టు కూడా నల్లగా మారుతుంది. జుట్టుకు అప్లే చేసిన మూడు గంటల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేయడం వల్ల జుట్టు నల్లగా మారుతుంది. 

(నోట్: ఈ సమాచారమంతా కొన్ని చిట్కాల నుంచి గ్రహించబడినది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం మేలు. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.) 

Also Read: Anti Ageing Juice: ఈ పండ్ల రసాలు తాగడం వల్ల ఎప్పటికీ యవ్వనంగా కనిపిస్తారు!

Also Read: Coffee Side Effects: ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News