/telugu/photo-gallery/2024-karthika-pournami-wishes-for-your-family-and-friends-with-hd-photos-beautiful-messages-sd-180865 2024 Karthika Pournami Wishes: మీ  కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇలా తెలపండి..! 2024 Karthika Pournami Wishes: మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇలా తెలపండి..! 180865

 

How To Remove Negative Thoughts From Mind: మన జీవితంలో మనం ఎప్పుడూ ఆలోచించని కొన్ని పరిస్థితుల గురించి ఆలోచిస్తాం. అందులో చాలా వరకు నెగిటివ్ ఎనర్జీని తెచ్చే విధంగా ఉంటాయి. దీని కారణంగా చాలామంది ప్రతికూల ఆలోచనలతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా కొంతమంది అయితే తీసుకోకూడని నిర్ణయాలు కూడా ఎంతో తొందరగా తీసుకొని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఈ ప్రతికూల ఆలోచనల వల్ల మానసిక సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి దీనిని కూడా ఓ వ్యాధిలా భావిస్తున్నారు. కొంతమంది నిపుణులు. ప్రతికూల ఆలోచనలనేవి మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటాయి. ప్రస్తుతం చాలామంది ఇలాంటి ఆలోచనల్లోనే మునిగిపోయి ఎన్నో సమస్యల బారిన పడుతున్నారు. మీ నుంచి ప్రతికూల ఆలోచనలు పోవడానికి మేము కొన్ని చిట్కాలను చెబుతున్నాం. ఆ చిట్కాలను పాటిస్తే మీరు పది రోజుల్లో నెగిటివ్‌గా ఆలోచించడం మానుకుంటారు.

నెగిటివ్ థింగ్స్ పోవడానికి ప్రతిరోజు ఈ చిట్కాలు పాటించండి:
ధ్యానం తప్పకుండా చేయండి:

ధ్యానం చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. మానసిక ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎక్కువగా ప్రతికూల ఆలోచనలతో సతమతమవుతున్న వారు ప్రతి రోజు ధ్యానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. కాబట్టి ఈ సమస్యతో బాధపడుతున్న వారు ప్రతి రోజు ఉదయం లేచిన వెంటనే ధ్యానం చేయడం వల్ల నెగిటివ్ థింగ్స్ నుంచి ఉపశమనం లభిస్తుంది.

Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

నెగిటివ్‌గా ఆలోచించే వారికి దూరంగా ఉండండి:
ప్రస్తుతం చాలామంది నెగిటివ్‌గా ఆలోచిస్తూ ఉంటారు ఇలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఎందుకంటే వారు ఆలోచించే విధానం మీపై కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలా ఆలోచించే వారికి దూరంగా ఉండి ఆనందంగా జీవించడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. 

మోటివేటివ్ బుక్స్ చదవండి:
ప్రస్తుతం లైబ్రరీలో ఎందరో మహానుభావుల చరిత్రలు బుక్స్ రూపంలో లభిస్తున్నాయి. అయితే వీటిని చదవడం వల్ల కూడా ప్రతికూల ఆలోచనల నుంచి బయట పడవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పుస్తకాల్లో ఉండే నీతి వాక్యాలు మీకు కూడా ఆసక్తి కలిగించవచ్చు. కాబట్టి ఎక్కువగా నెగిటివ్‌గా ఆలోచించేవారు తప్పకుండా బుక్స్‌ని చదవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

 

Section: 
English Title: 
You Can Remove Negative Thoughts From Mind Permanently With 3 Tips Dh
News Source: 
Home Title: 

Negative Thoughts: ప్రతికూల ఆలోచనలతో సతమతమవుతున్నారా? ఈ 3 చిట్కాలతో వదిలించుకోండి..
 

Negative Thoughts: ప్రతికూల ఆలోచనలతో సతమతమవుతున్నారా? ఈ 3 చిట్కాలతో వదిలించుకోండి..
Caption: 
source file: zee telugu news
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
ప్రతికూల ఆలోచనలతో సతమతమవుతున్నారా? ఈ 3 చిట్కాలతో వదిలించుకోండి..
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Wednesday, December 27, 2023 - 23:06
Created By: 
Cons. Dhurishetty Dharmaraju
Updated By: 
Cons. Dhurishetty Dharmaraju
Published By: 
Cons. Dhurishetty Dharmaraju
Request Count: 
38
Is Breaking News: 
No
Word Count: 
288