14 Movie First Look: ఆసక్తిరేకిస్తోన్న ‘14’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్..

14 Movie First Look: టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోన్న సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ కోవలో వచ్చిన మరో  థ్రిల్లర్ మూవీ ‘14’. తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 27, 2024, 12:16 PM IST
14 Movie First Look: ఆసక్తిరేకిస్తోన్న ‘14’ మూవీ ఫస్ట్ లుక్  పోస్టర్..

14 Movie First Look: రాయల్ పిక్చర్స్ పతాకంపై  లక్మీ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘14’. సుబ్బారావు రాయన మరియు శివకృష్ణ నిచ్చన మెట్ల సంయుక్తం గా  నిర్మించారు. ఈ చిత్రం జులై 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది, ఈ సందర్భంగా   చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను డైరెక్టర్స్ యూనియన్ ప్రెసిడెంట్ డైరెక్టర్ వీర శంకర్  లాంచ్ చేశారు. ఈ సందర్భంగా
వీరశంకర్  మాట్లాడుతూ అద్భుతమైనటు వంటి స్క్రీన్ ప్లే తో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అయినటు వంటి ‘14’ చిత్రం కచ్చితంగా మంచి హిట్ కొడుతుందన్నారు. కొత్త కథతో ఈ సినిమా తెరకెక్కించడం చాలా ఆనందమని కొనియాడారు.
     
రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం లో నోయల్, విషాక ధీమాన్ లీడ్ రోల్స్ పోషించారు. రతన్, పోసాని కృష్ణ మురళి,శ్రీకాంత్ అయ్యంగర్, రూపాలక్ష్మి తదితరులు నటించారు.ఈ చిత్రానికి కళ్యాన్ నాయక్ పాటలు అందించగా ఆదిత్య భార్గవ్ మాటలు రాశారు.

ఇదీ చదవండి: మన దేశంలో వారాహీ అమ్మవారు దేవాలయాలు ఎక్కడున్నాయి.. వాటి ప్రత్యేకతలు ఏమిటంటే.. !

డైరెక్టర్ వీర శంకర్ విషయానికొస్తే.. ఈయన ‘హలో ఐ లవ్ యూ’ మూవీతో దర్శకుడిగా పరిచయమయ్యారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ తో ‘గుడుంబా శంకర్’ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా విజయం సాధించకపోయినా.. కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది.

ఇదీ చదవండి: ‘కల్కి 2898 AD’ మూవీ రివ్యూ.. ఆకట్టుకునే ‘కల్కి’ సినిమాటిక్ యూనివర్స్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News