Average Student Nani Review: ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ రివ్యూ.. మెప్పించిందా..!

Average Student Nani Movie Review: గత కొన్నేళ్లుగా తెలుగులో డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న చిత్రాలకు ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్నారు. సినిమాలో కాస్త విషయం ఉంటే నెత్తిన పెట్టుకుంటున్నారు. ఈ కోవలో మన సమాజంలో జరుగుతున్న నిజ జీవిత సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘యావరేజ్ స్టూడెంట్ నాని’. ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో మన మూవీ రివ్యూలో చూద్దాం..

Written by - TA Kiran Kumar | Last Updated : Aug 1, 2024, 09:01 PM IST
Average Student Nani Review: ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ రివ్యూ.. మెప్పించిందా..!

నటీనటులు: పవన్ కుమార్, షహీబా బసిన్, స్నహా మాల్వియా, రాజీవ్ కనకాల, వివియా సంత్ తదితరులు

రచయత: పవన్ కుమార్

ఎడిటర్ : ఎస్.బి.ఉద్దవ్  

సంగీతం: కార్తీక్ కొడకండ్ల

నిర్మాణ సంస్థ: శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి

నిర్మాత: పవన్ కుమార్

దర్శకత్వం: పవన్ కుమార్

గత కొన్నేళ్లుగా తెలుగులో వస్తోన్న కొత్త హీరోలు.. వాళ్ల కథలను సెలెక్ట్ చేసుకోవడంతో పాటు ఎలాంటి అనుభవం లేకుండానే మెగాఫోన్ పట్టుకొని రంగంలోకి దిగిపోతున్నారు. ఈ కోవలో పవన్ కుమార్ హీరోగా నటిస్తూ.. దర్శకత్వం వహిస్తూ నిర్మించిన చిత్రం ‘యావరేజ్ స్టూడెంట్ నాని’. ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించేలా ఉందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ విషయానికొనస్తే..

 నాని (పవన్ కుమార్) చదువుల్లో యావరేజ్ స్టూడెంట్. ఓ కాలేజీలో బీటెక్ చదువుతుంటాయి.  అయితే.. అతనికి తండ్రికి మాత్రం అతను యావరేజ్ కాకుండా.. బ్రిలియంట్ స్టూడెంట్ తనతో పాటు ఇంట్లో వాళ్లకు పేరు తీసుకురావాలని ఆరాటపడుతుంటాడు. కానీ నాని మాత్రం చదవును పక్కనపెట్టి కాలేజ్ జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో అతను తనకు సీనియర్ అయిన సారా (స్నేహ)ను చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. ఆమె కూడా ఇతన్ని ప్రేమిస్తుంది. ఈ క్రమంలో అతని జీవితంలో అనుకోని సంఘటన జరగుతుంది. ఈ నేపథ్యంలో అతని జీవితం పూర్తిగా మారిపోతుంది. ఈ క్రమంలో కాలేజీలో యావరేజ్ స్టూడెంట్ అయిన నాని.. జీవితంలో సక్సెస్ అందుకున్నాడా.. ?లేదా అనేదే ఈ సినిమా స్టోరీ.  

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..

ఈ మధ్య కాలంలో కొత్తగా సినీ ఇండస్ట్రీలోకి వస్తోన్న యూత్.. ఓటీటీ లేదా ప్రపంచ సినిమాలతో పాటు యూట్యూబ్ లో డైరెక్షన్ నేర్చుకొని నేరుగా సినిమా రంగంలోకి వచ్చేస్తున్నారు. ఈ కోవలో పవన్ కుమార్ ‘మెరిసే మెరిసే’ సినిమా తర్వాత మెగాఫోన్ పట్టుకొని..నిర్మాతగా ఈ సినిమాను నిర్మించడం అభినందనీయం. ఇలాంటి కథలు తెలుగులో వచ్చినా.. పవన్ మాత్రం.. తన మార్క్ స్క్రీన్ ప్లే.. దర్శకత్వంతో మెప్పించారు. అంతేకాదు తన ఏజ్ తగ్గ స్టూడెంట్ లైఫ్ పాత్రలో ఎంతో ఈజ్ తో నటించి మెప్పించాడు.  జీవితంలో మార్కులు మాత్రమే ఒక వ్యక్తి స్థాయిని  నిర్ణయించలేవు. కేవలం అతని వ్యక్తిత్వానికి అవి కొలమానాలు కావు. చదవుకున్న వాళ్లంతా గొప్పవాళ్లు కాదు. అలా రాని అంతగా చదవు రాని వాళ్లు పనిరారని కాదు. ఈ సినిమాతో యూత్ కు మంచి మెసేజ్ ఇచ్చాడు. ఫస్టాఫ్ మొత్తం.. కాలేజ్ లైఫ్.. రొమాన్స్.. యాక్షన్ అంటూ సాగినా.. సెకండాఫ్ లో ఎమోషన్ తో ప్రేక్షకుల గుండెలను పిండేలా ఉంది. ఆ తర్వాత మళ్లీ ఎంటర్మైన్మెంట్ జోన్ లోకి సినిమాలను తీసుకెళ్లడం వంటివి యూత్ కు  కనెక్ట్ అయ్యేలా కన్విన్సింగ్ గా చెప్పడం మెచ్చుకోదగ్గ అంశం. అంతేకాదు ఈ సినిమాలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ...తమ అబ్బాయి యావరేజ్ స్టూడెంట్ అయితే.. సమాజంలో ఎలా తలెత్తుకోలేకపోతున్నారనే విషయం అందరికీ కనెక్ట్ అవుతోంది. ఇద్దరి హీరోయిన్స్ రొమాంటిక్ సీన్స్.. యూత్ ను అట్రాక్ట్ చేసే విధంగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ.. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాలో డైలాగ్స్ నిజ జీవితాన్ని అక్కడక్కడ ప్రతిబింబించాయి.

నటీనటుల విషయానికొస్తే..
పవన్ కుమార్ నాని పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. ఈ సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ చూపించాడు.  ఓ కాలేజీ కుర్రాడు ఎలా అయితే ఉంటాడో తెరపై నాని అచ్చు అలాగే కనిపించి మెప్పించాడు. హీరోయిన్స్ పాత్రలో నటించిన స్నేహా, సాహిబా ఇద్దరూ స్క్రీన్ పై  గ్లామరస్ గా  కనిపించారు. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.

రేటింగ్ 2.75/5

ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..

ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News