Nenu Keerthana: ‘నేను - కీర్తన’ మూవీ నుంచి ‘కొంచెం కొంచెం గుడుగుడు గుంజమ్’ ఐటమ్ పాటకు సూపర్ రెస్పాన్స్..

Nenu Keerthana: చిమటా రమేశ్ బాబు హీరోగా పరిచయం అవుతూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నేను కీర్తన’. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘కొంచెం కొంచెం గుడుగుడు గుంజం’ ఐటెం సాంగ్ విడుదల చేస్తే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 9, 2024, 06:37 PM IST
Nenu Keerthana: ‘నేను - కీర్తన’ మూవీ నుంచి ‘కొంచెం కొంచెం గుడుగుడు గుంజమ్’ ఐటమ్ పాటకు సూపర్ రెస్పాన్స్..

Nenu Keerthana: సినీ ఇండస్ట్రీలో ఎపుడు కొత్త నీరు వస్తూ ఉంటుంది. ఈ కోవలో చిమటా రమేశ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘నేను కీర్తన’. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాలోని ‘కొంచెం కొంచెం గుడు గుడు గుంజం’ లిరికల్ వీడియోకు సామాజిక మాధ్యమాల్లో మంచి స్పందన వస్తుంది. ఈ లిరికల్ వీడియోను సీనియర్ నటులు మురళీమోహన్ విడుదల చేశారు. అంచుల నాగేశ్వరరావుతో కలిసి చిమటా రమేష్ బాబు ఈ పాటను రచన చేశారు. ఈ సాంగ్ ను హరి గుంట - లాస్య ప్రియ పాడారు. ఎమ్.ఎల్.రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.  హీరో రమేష్ బాబు - రేణు ప్రియలపై ఈ ఐటమ్ సాంగ్ పిక్చరైజ్ చేశారు.

Add Zee News as a Preferred Source

చిమటా ప్రొడక్షన్స్ పతాకంపై చిమటా రమేష్ బాబు ("సి.హెచ్.ఆర్")ను దర్శకుడిగా మారి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్) సరసన- రిషిత - మేఘన హీరోయిన్లుగా నటిస్తున్నారు. చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ) సమర్పణలో చిమటా లక్ష్మికుమారి భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. త్వరలో "నేను-కీర్తన" చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

‘బేబి’ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్ రిలీజ్ చేసిన సీతా కోకై" లిరికల్ వీడియోతోపాటు... జయభేరి అధినేత మురళీమోహన్  రిలీజ్ చేసిన "కొంచెం కొంచెం గుడుగుడు గుంజం" లిరికల్ వీడియోకు కూడా అనూహ్యమైన స్పందన వస్తుంది. దీంతో ఈ సినిమా విజయంపై నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమాలోని పాటలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు రమేశ్ బాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

మల్టీ జోనర్ ఫిల్మ్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీతో సిద్ధంగా ఉన్నది.  "నేను కీర్తన" చిత్రానికి బిజినెస్ పరంగానూ మంచి క్రేజ్ ఏర్పడింది.  కులుమనాలిలో చిత్రీకరించిన పాటలతోపాటు... ఆరు రోప్ ఫైట్స్ ఈ చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్ గా నిలువనున్నాయి.

సంధ్య, జీవా, విజయరంగ రాజు, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ సన్నీ, రాజ్ కుమార్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. నృత్యాలు: అమిత్ కుమార్ - సి.హెచ్.ఆర్, పాటలు: సి.హెచ్.ఆర్ - అంచుల నాగేశ్వరరావు - శ్రీరాములు, సంగీతం: ఎం.ఎల్.రాజా, ఛాయాగ్రహణం: కె. రమణ, కూర్పు: వినయ్ రెడ్డి బండారపు, సమర్పణ: చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ), నిర్మాత: చిమటా లక్ష్మికుమారి, రచన - దర్శకత్వం: చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్.). పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, డి.ఐ: భాను ప్రకాష్, వి.ఎఫ్.ఎక్స్: నవీన్, ఎస్.ఎఫ్.ఎక్స్: ఎ. నవీన్ రెడ్డి, పోరాటాలు: నూనె దేవరాజ్.

Read more: Snake Crawling: నిద్రలో ఉన్న యువతిపై దూసుకొచ్చిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News