Parakamani: తెలుగులో మరో డిఫరెంట్ సోషియో ఫాంటసీ మూవీ ‘పరకామణి’ సినిమా గ్రాండ్ గా ప్రారంభం..

Parakamani: తెలుగులో ఎప్పటికప్పడు డిఫరెంట్ మూవీస్ వివిధ దర్శకులు అలరిస్తున్నారు. ఈ కోవలో ఎర్రచీరతో దర్శకుడిగా త్వరలో పలకరించబోతున్న సి. హెచ్. సుమన్ బాబు మరో సారి మెగా ఫోన్ పట్టుకొని తెరకెక్కిస్తున్న చిత్రం ‘పరకామణి’. తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Nov 15, 2024, 09:30 PM IST
Parakamani: తెలుగులో మరో డిఫరెంట్ సోషియో ఫాంటసీ మూవీ ‘పరకామణి’ సినిమా గ్రాండ్ గా ప్రారంభం..

Parakamani: తెలుగులో త్వరలో ‘ఎర్రచీర’ సినిమాతో దర్శకుడిగా అలరించబోతున్న సుమన్ బాబు .. ఆ సినిమా విడుదల కాకముందే తాజాగా తన ఓన్ డైరెక్షన్ లో మరో అద్భుతమైన భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కించబోతున్నాడు. ఈ చిత్రాన్ని సోషియో ఫాంటసీ జానర్లో నిర్మిస్తున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా  ఈ చిత్రం టైటిల్ ‘పరకామణి’ పోస్టర్ ను విడుదల చేశారు. మనకు ‘పరకామణి’ అంటే తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయంలో శ్రీవారి హుండీని లెక్కించే స్థలాన్ని ‘పరకామణి’గా పిలుస్తుంటారు. ఆ టైటిల్ తో ఈ సినిమాపై అటెన్షన్ క్రియేట్ చేసారు.

Add Zee News as a Preferred Source

ఇంతకు ముందు ఎన్నడూ చూడని సరికొత్త కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు డైరెక్టర్ సి.హెచ్. సుమన్ బాబు తెలిపారు. సుమారు రూ.20 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సృష్టిలో పైన ఏడు లోకాలు.. కింద ఏడు లోకాలున్నాయేది శాస్త్ర వచనం. అందులో భూలోకంలో కిందనున్న  ఏడు లోకాలైన అతల, వితల, సుతల, తలా తల, రసాతల, పాతాళ, భూతల లోకాలను చూపిస్తూ, అద్భుతమైన గ్రాఫిక్స్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా కూడా ప్రేక్షకులను సరికొత్త అనుభూతి ఇవ్వడం పక్కా అని చెబుతున్నారు. ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోలిద్దరు నటిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ చిత్రం యొక్క పూర్తి వివరాలు ఇతర నటీనటుల వివరాలు.. సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు.  అయితే సుమన్ బాబు నటించి స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ఎర్ర చీర డిసెంబర్ 20న విడుదల కానుంది.

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News