Eid Mubarak 2023 Wishes: ముస్లిం సోదరులకు అతి పెద్ద పండగ రంజాన్.. ఈ రోజు వారంత ఎంతో పవిత్రంగా, భక్తి శ్రద్ధలతో అల్లాకి ప్రార్థనలు చేస్తారు. మీతో కలసి మెలసి ఉంటున్న మీ ప్రియమైన ముస్లిం మిత్రులకు సందేశాలు, ఇతర సోషల్ మీడియా ద్వారా ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలపండి.
రంజాన్ పండగా చంద్రుడి గమనం ఆధారంగా ఈ పండగా సాగుతుంది. ఇదే క్రమంలో ముస్లిం పెద్దలు హజ్ యాత్ర కూడా చేస్తారు. సౌదీ అరేబియాలో ఏ రోజు నెలవంక కనిపిస్తుందో ఆ రోజు నుంచే పండగ ప్రారంభమవుతుంది.
ఇతర దేశాల్లో కంటే భారత దేశ వ్యాప్తంగా రంజాన్ పండగాను ముందుగానే జరుపుకోవడం ఆనవాయితిగా వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లీంలు భక్తులు రంజాన్ మాసం మొత్తం ఉపవాసాలు పాటిస్తారు. అంతేకాకుండా ప్రార్థనలు కూడా చేస్తారు.
రంజాన్ రోజునే 'ఖురాన్' అవతరించింది. కాబట్టి ఈ గ్రంథానికి చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. కాబట్టి ఈ మాసం మొత్తం ఉపవాసాలు, దీక్షలు కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి ఈ క్రమంలో భక్తి శ్రద్ధలతో ఉండడం వల్ల అల్లా అనుగ్రహం లభిస్తుంది.
ఈ రంజాన్‌లో ఇఫ్తార్ విందులకు కూడా చాలా ప్రాధాన్యత ఉంది. ముస్లిం భక్తులంతా ఉపవాసాలు పాటించి తర్వాతి రోజున ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. ఈ విందు సూర్యాస్తమయం తర్వాత ముగిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook