/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Minister Harish Rao On Amit Shah: కల్లూరు మండలం సగం మీటింగ్‌లో ఉన్న మంది కూడా నిన్న అమిత్ షా మీటింగ్‌లో లేరని మంత్రి హరీష్‌ రావు సెటైర్లు వేశారు. నాలుగు జిల్లాల నుంచి సభకు  తరలించారటని అన్నారు. సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరులో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అధికారంలోకి వస్తామని చెబుతున్న బీజేపీ మాటలు ఎండమావియేనని అన్నారు. 

'నిజం చెప్పకుంటే అబద్ధాలు ప్రచారం అవుతాయని అంబేద్కర్ గారు చెప్పారు. మీరంతా మనం చేసింది చెప్పాలి. యాసంగి పంట 2014లో 14 లక్షల ఎకరాలు పండితే.. నేడు 56 లక్షల ఎకరాల్లో పంట పండింది. 2014లో 3600 కోట్లు పంట కొనుగోళ్లు చేస్తే.. గతేడాది 26,600 కోట్లు కొనుగోలు చేశాం. దేశంలో మొత్తం ఎంత పంట పండుతున్నదో.. ఇప్పుడు ఒక్క మన రాష్ట్రంలోనే పండుతున్నది. కరువు అనే పదాన్ని సీఎం కేసీఆర్ డిక్షనరీ నుంచి తొలగించారు. అకాల వర్షాలకు రైతులు అధైర్య పడొద్దు, రైతు ప్రభుత్వం మనది. రైతు నాయకుడు కేసీఆర్. 

మొన్న పంట నష్ట పోతే ఎకరాకు రూ.10 వేలు ప్రకటించారు. ఇప్పుడు కూడా అకాల వర్షాల వల్ల నష్ట పోయారు. కేసీఆర్ ఉన్నడు. రైతులు అధైర్య పడొద్దు. పంట నష్టం అంచనా వేయాలని సీఎస్‌కు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఛత్తీస్‌గడ్‌లో యాసంగిలో ఒక్క గింజ కొనరు. కానీ తెలంగాణలో ప్రతి గింజ రెండు పంటలు కొనుగోలు చేస్తున్నాం. కేసీఆర్ రైతు విలువ పెంచారు కాబట్టి భూముల విలువ పెంచారు..' అని హరీష్ రావు అన్నారు. 

కర్ణాటక ఎన్నికల్లో ఓటమి తప్పదనే ఫ్రస్టేషన్‌లో అమిత్ షా ఉన్నారని అన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. 'నిన్న వచ్చి ఏం చెప్పాడు. రూ.1350 కోట్లు హక్కుగా రావాల్సిన దాని గురించి చెప్పాడా..? బయ్యారం ఉక్కు పరిశ్రమ గురించి చెప్పాడా..? జాతీయ ప్రాజెక్టు గురించి చెప్పాడా..? ఖమ్మం జిల్లాలో ఉన్న 7 మండలాలు కలిపారు. పేపర్ లీకేజీ చేసిన వాడిని పక్కన పెట్టుకున్నావు. కాంగ్రెస్ వాళ్లు చేసింది ఏముంది..? రైతులకు కరెంట్, ఎరువులు ఇవ్వలేదు. ఏం ముఖం పెట్టుకొని ప్రజల వద్దకు వస్తారు..' అని హరీష్ రావు అన్నారు. 

Also Read: IRCTC Refund Rules: చార్ట్ ప్రిపేర్ అయిన తరువాత రైల్వే టికెట్ క్యాన్సిల్ చేసినా రీఫండ్ పొందొచ్చు.. ఎలాగంటే..?
 
ఢిల్లీ పెద్దలకు కాంగ్రెస్ వాళ్లు.. గుజరాత్ వాళ్లకు బీజేపీ వాళ్లు గులాంగిరి చేస్తారంటూ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు, రైతు బీమా, కళ్యాణ పథకాలు పోతాయన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు కాదు.. డబుల్ స్టాండర్డ్ ప్రభుత్వాలు కావాలన్నారు. ఎవరు ఎన్ని ట్రిక్కులు ప్లే చేసినా.. హ్యాట్రిక్ కొట్టేది మనమేనంటూ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్య్రమంలో మంత్రి అజయ్ కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తదితరులు పాల్గొన్నారు. 

Also Read: Ajinkya Rahane IPL: రఫ్పాడిస్తున్న అజింక్యా రహానే.. ఆ టైమింగే వేరప్పా..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Section: 
English Title: 
minister harish rao speech at brs party atmiya sammelanam in kallur khammam district and fires om union minister amit shah
News Source: 
Home Title: 

Minister Harish Rao: బీజేపీ మాటలు ఎండమావే.. హ్యాట్రిక్ కొట్టేది మనమే.. హరీష్‌ రావు ధీమా 
 

Minister Harish Rao: బీజేపీ మాటలు ఎండమావే.. హ్యాట్రిక్ కొట్టేది మనమే.. హరీష్‌ రావు ధీమా
Caption: 
Minister Harish Rao Comments On BJP (Source: Facebook)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
బీజేపీ మాటలు ఎండమావే.. హ్యాట్రిక్ కొట్టేది మనమే.. హరీష్‌ రావు ధీమా 
Ashok Krindinti
Publish Later: 
No
Publish At: 
Monday, April 24, 2023 - 14:58
Created By: 
Krindinti Ashok
Updated By: 
Krindinti Ashok
Published By: 
Krindinti Ashok
Request Count: 
28
Is Breaking News: 
No
Word Count: 
344