RCB vs KKR Playing 11 Out: ఐపీఎల్ 2023లో తొలి దశ మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఒక్కో జట్టు ఏడేసి మ్యాచ్‌లు ఆడాయి. నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో రెండో దశ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా మరికాసేపట్లో జరిగే ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన బెంగళూరు తాత్కాలిక కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో కోల్‌కతా ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌కు కూడా విరాట్ కోహ్లీ ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఇంపాక్ట్ ఆటగాడిగా బరిలోకి దిగనున్నాడు. ఈ మ్యాచ్ కోసం కోల్‌కతా కెప్టెన్ నితీష్ రాణా ఒక మార్పు చేశాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు ఇప్పటివరకు 31 మ్యాచుల్లో తలపడ్డాయి. కోల్‌కతా 17 మ్యాచుల్లో గెలవగా.. బెంగళూరు 14 మ్యాచుల్లో గెలిచింది. ఈ సీజన్లో ఆడిన మ్యాచ్‌లో కోల్‌కతా విజయం సాధించింది. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ ఫాఫ్ డుప్లెసిస్ (407) వద్ద ఉండగా.. పర్పుల్ క్యాప్ రషీద్ ఖాన్ (14) వద్ద ఉంది. పర్పుల్ క్యాప్ కోసం మహమ్మద్ సిరాజ్ (13) ఒక్క వికెట్ దూరంలో ఉన్నాడు.
తుది జట్లు:
కోల్‌కతా నైట్ రైడర్స్: నారాయణ్ జగదీశన్, జేసన్ రాయ్, వెంకటేశ్ అయ్యర్, నితీష్ రాణా (కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రూ రస్సెల్, సునీల్ నరైన్, డేవిడ్ వైజ్, వైభవ్ అరోరా, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), షాబాజ్ అహ్మద్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తిక్, సుయాశ్ ప్రభుదేశాయ్, వానిందు హసరంగ, డేవిడ్ విల్లీ, విజయ్‌కుమార్ వైశాక్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్.
🚨 Toss Update 🚨@RCBTweets win the toss & elect to field first against @KKRiders.
Follow the match ▶️ https://t.co/o8MipjFd3t #TATAIPL | #RCBvKKR pic.twitter.com/uSRkTWuzxQ
— IndianPremierLeague (@IPL) April 26, 2023
ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్లు:
కోల్‌కతా: మన్దీప్ సింగ్, లిట్టన్ దాస్, అనుకుల్ రాయ్, సుయాశ్ శర్మ, కుల్వంత్ ఖేజ్రోలియా.
బెంగళూరు: ఫాఫ్ డుప్లెసిస్, ఆకాశ్ దీప్, కర్ణ్ శర్మ, ఫిన్ అలెన్, అనుజ్ రావత్.
Also Read: AP Inter Results 2023: ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.