Trai New Rules: టెలీకం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు ఇవాళ్టి నుంచి అమలు కానున్నాయి. ఇక నుంచి చీటికి మాటికీ వేధించే అన్‌వాంటెడ్ కాల్స్, మెస్సెజెస్ బెడద తప్పనుంది. ట్రాయ్ కొత్త నిబంధనలేంటి, యూజర్లకు కలిగే లాభాలేంటో తెలుసుకుందాం..
ఫోన్ వినియోగం పెరిగిన కొద్దీ వివిధ రకాల ప్రమోషనల్ కాల్స్, ఎస్ఎంఎస్, ఫేక్ కాల్స్ బెడద తీవ్రమౌతోంది. అత్యవసర పనుల్లో ఉన్నప్పుడు వచ్చే ప్రమోషనల్ కాల్స్ ఇంకా విసిగిస్తుంటాయి. ఏదైనా ఎమర్జన్సీ ఫోన్ అనుకుని లిఫ్ట్ చేస్తే అది కాస్తా ఏ ప్రమోషనల్ కాల్‌గానో అయుండే పరిస్థితి. చాలాకాలంగా ఫోన్ కస్టమర్లను ఇది తీవ్రంగా విసిగిస్తోంది. ఈ బెడద ఇకపై ఉండదు. ట్రాయ్ వివిధ టెలీకం కంపెనీలకు విధించిన షరతులు ఇవాళ్టి నుంచి అమల్లోకి రానున్నాయి. ఫోన్ వినియోగదారుల్ని ఫేక్ కాల్స్, ప్రమోషనల్ కాల్స్, ఎస్ఎంఎస్ బారి నుంచి రక్షించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయం తీసుకోవల్సిందిగా టెలీకం కంపెనీలను కోరింది ట్రాయ్.
ఇందులో భాగంగా వివిధ టెలీకం కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫిల్టర్ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నాయి. ట్రాయ్ ఆదేశాలకు అనుగుణంగా మే 1 నుంచి ఈ ఆప్షన్ వినియోగంలో రానుంది. వాస్తవానికి ప్రైవసీ సమస్య కారణంగా ఎయిర్‌టెల్, జియో వంటి కంపెనీలు ఈ టెక్నాలజీ వినియోగానికి నిరాకరించాయి. అయితే ట్రాయ్ ఆదేశాలుండటంతో కేవలం ఫేక్ కాల్స్, ఎస్ఎంఎస్‌లు, వినియోగదారుల్ని ఇబ్బంది కల్గించే కాల్స్‌ను అరికట్టేందుకు మాత్రమే ఏఐ ఫిల్టర్ వినియోగించేందుకు అంగీకరించాయి.
Also read: Bank Holidays: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్, మే నెలలో 12 రోజులు సెలవులు, ఇదే జాబితా
ఉపయోగమేంటి
కొత్త టెక్నాలజీ వినియోగం పెరుగుతున్న కొద్దీ అవగాహనా రాహిత్యంతో స్పామ్ కాల్స్, ఫేక్ కాల్స్, మెసేజెస్‌లు చికాకు కల్గిస్తుంటాయి. ఒక్కోసారి అనర్ధాలకు దారితీస్తుంటుంది. ఇలాంటివాటిని అరికట్టేందుకు గత కొద్దికాలంగా దృష్టి పెట్టిన ట్రాయ్..కాల్ ఐడీని అందుబాటులోకి తెచ్చేలా టెలీకం కంపెనీలకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ కాల్ ఐడీ ఆప్షన్‌తో ఇక నుంచి పోన్ చేసేవారి పేర్లు, ఫోటోలు ఫోన్‌లో ప్రత్యక్షమౌతాయి. దీంతో ఎవరు ఫోన్ చేసేది తెలిసిపోతుంది.
Also read: Gas Cylinder Prices: గుడ్‌న్యూస్, భారీగా తగ్గిన గ్యాస్ ధర, ఇవాళ్టి నుంచి అమలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook