Arangetram Review : సైకో థ్రిల్లర్ 'అరంగేట్రం'.. వరుస హత్యల వెనుకున్న కథ ఏంటంటే?

Arangetram Movie Review And Rating అరంగేట్రం సినిమా సైకో థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కింది. ఈ సినిమాతో శ్రీనివాస్ ప్రభన్ హీరోగా,దర్శకుడిగా తన సత్తా చాటేందుకు ప్రయత్నించాడు. మరి ఈ సినిమా కథ, కథనాలు ఏంటి? అసలు సైకో ఫ్లాష్ బ్యాక్ ఏంటన్నది ఓ సారి చూద్దాం.

Written by - ZH Telugu Desk | Last Updated : May 4, 2023, 08:12 AM IST
  • సైకో థ్రిల్లర్‌గా అరంగేట్రం
  • దర్శకుడిగా, హీరోగా శ్రీనివాస్
  • వరుస హత్యల ఫ్లాష్ బ్యాక్ ఇదే
Arangetram Review : సైకో థ్రిల్లర్ 'అరంగేట్రం'.. వరుస హత్యల వెనుకున్న కథ ఏంటంటే?

Arangetram Movie Review సైకో థ్రిల్లర్ జానర్‌ల మీద జనాలకు ఎప్పుడూ ఇంట్రెస్ట్ ఉంటుంది. వరుస హత్యలు జరగడం, వాటికి వెనుక ఓ సైకో ఉండటం.. సైకోకి ఓ ఫ్లాష్ బ్యాక్ ఉండటం అనేది కామన్. అయితే వాటిని మనం ఎంత ఇంట్రెస్టింగ్‌గా చూపిస్తామనే దాని మీద సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అరంగేట్రం సినిమా కూడా అదే జానర్‌లో వచ్చింది. మరి ఈ సినిమాతో హీరోగా,దర్శకుడిగా శ్రీనివాస్ ప్రభన్ సక్సెస్ అయ్యాడా? లేదా? అన్నది చూద్దాం.

కథ
సిటీలో వరుసగా అమ్మాయిల హత్యలు జరుగుతుంటాయి. అది కూడా సరిగ్గా ప్రతీ నెల 13వ తేదీనే ఆ హత్యలు జరుగుతుంటాయి. వాటి వెనుకున్న సైకోని పట్టుకునేందుకు పోలీసు యంత్రాంగం విఫలయత్నం చేస్తుంది. కానీ సైకోని పట్టుకోలేకపోతారు. ఇక సైకోను పట్టుకునేందుకు శ్రీనివాస్ ప్రభన్ (శ్రీనివాస్ ప్రభన్) చేసిన ప్రయత్నాలు ఏంటి? అసలు ఆ సైకోకి శ్రీనివాస్‌కు ఉన్న లింక్ ఏంటి? సైకో వల్ల శ్రీనివాస్ గతం ఎలా ప్రభావం చూపించింది? అసలు ఆ సైకో ఎందుకు అలా అమ్మాయిలను అదే డేట్‌కు చంపుకుంటూ వెళ్తున్నాడా? సైకోగా మారడానికి దారి తీసిన కారణాలు ఏంటి? చివరకు శ్రీనివాస్‌ ఆ సైకోని మట్టుపెట్టాడా? అన్నదే కథ.

నటీనటులు
అరంగేట్రం మూవీలో శ్రీనివాస్ ప్రభన్ నటన ఆకట్టుకుంటుంది. యాక్షన్ సీక్వెన్స్, ఎమోషనల్ సీన్స్ పర్వాలేదనిపిస్తాయి. కొన్ని సీన్లలో నవ్వించే ప్రయత్నం కూడా చేస్తాడు. సైకో పాత్రలో ముస్తఫా అస్కరి విలనిజాన్ని ప్రదర్శించాడు. పూజా, లయ, రోషన్ ఇలా అందరూ కూడా కనిపించినంతలో మెప్పిస్తారు. జబర్దస్త్ సత్తిపండు అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇలా అన్ని పాత్రలు తమ పరిధి మేరకు ఆకట్టుకుంటాయి.

విశ్లేషణ

సైకో థ్రిల్లర్ సినిమాలకు కొత్తగా లైన్ అంటూ ఏమీ ఉండదు. అన్నీ ఒకే ఫార్మాట్లో ఉంటాయి. ఇది వరకు మనం ఎన్నో సైకో చిత్రాలను చూశాం. ఓ సైకో ఉంటాడు.. అతనికి దారుణమైన ఫ్లాష్ బ్యాక్.. దాంతో అతను సైకోగా మారతాడు.. అందర్నీ వరుసగా చంపుతాడు. అతడ్ని పట్టుకునేందుకు హీరోకి ఓ లింక్‌ను ఏర్పాటు చేస్తారు. అన్ని సినిమాల్లో దాదాపుగా ఇదే కథ ఉంటుంది. ఇందులోనూ ఇలాంటి పాయింటే కనిపిస్తుంది.

అయితే ఇందులో తీసుకున్న పాయింట్ కాస్త కొత్తగా అనిపిస్తుంది. మామూలుగా అయితే అమ్మను పాజిటివ్‌గా చూపిస్తుంటారు. కానీ ఇందులో నెగెటివ్‌గా చూపించి.. అసలు పాయింట్‌ను అక్కడి నుంచే ప్రారంభిస్తారు. ఇలా సైకో ఫ్లాష్ బ్యాక్ కొత్తగా అనిపిస్తుంది. హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్ ఓల్డ్‌గా అనిపించినా.. పర్వాలేదనిపిస్తుంది. సైకోకి, హీరోకి ఉన్న లింక్‌ను జనాలు ముందే పసిగట్టేస్తారు. ఆ ట్విస్ట్ అంతగా మెప్పించకపోయినా ఆ ఫ్లోలో ఓకే అనిపిస్తుంది.

సైకో థ్రిల్లర్ మూవీకి హీరో, విలన్ మధ్య ఉండే ఆ కాంఫ్లిక్ట్ మరింత ఇంట్రెస్టింగ్‌గా చూపించే ఉంటే బాగుండేదనిపిస్తుంది. ఇక హీరోనే దర్శకుడు కావడంతో కాస్త ఎలివేషన్ సీన్లు ఎక్కువగా పడ్డట్టు అనిపిస్తుంది. ప్రథమార్థం అసలు ఏం జరుగుతుందో అర్థం కానట్టుగా ఉంటుంది. అప్పుడు తలెత్తే ప్రశ్నలకు ద్వితీయార్థంలో సమాధానాలు దొరుకుతాయి. క్లైమాక్స్ కాస్త ఎమోషనల్‌గా ముగుస్తుంది.

Also Read:  Manobala Death : ఇండస్ట్రీలో విషాదం.. నటుడు మనోబాల మృతి

సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. ఆర్ఆర్ ఆకట్టుకుంటుంది. ఓ సాంగ్ తెరపై చూడటానికి బాగుంటుంది. సినిమాటోగ్రఫీ ఓకే అనిపిస్తుంది. ఎడిటర్ ఆ నిడివితో ప్రేక్షకులను బోర్ కొట్టించకుండా కట్ చేశాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

రేటింగ్ : 2.5

Also Read:  Aadi Sai Kumar Wife : ఇలా కూడా ఉంటారా?.. ఆది సాయి కుమార్ భార్య కోరిక, కల ఇదేనట

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News