Sun Transit 2023: మరో 10 రోజుల్లో ఈరాశుల జాతకం మారిపోనుంది.. ఇందులో మీ రాశి ఉందా?

Surya Gochar 2023: ఈ నెల 14న సూర్యుడు మేషరాశిని వదిలి వృషభరాశి ప్రవేశం చేయనున్నాడు. ఆదిత్యుడి యెుక్క ఈ గోచారం కారణంగా మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : May 5, 2023, 11:47 AM IST
Sun Transit 2023:  మరో 10 రోజుల్లో ఈరాశుల జాతకం మారిపోనుంది.. ఇందులో మీ రాశి ఉందా?

Sun Transit 2023: ఆస్ట్రాలజీలో సూర్యభగవానుడిని గ్రహాల రాజు అని పిలుస్తారు. ఆదిత్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి వెళ్లడాన్ని సంక్రాంతి అని పిలుస్తారు. సంక్రాంతి రోజున స్నానం మరియు దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. మే 14న ఆదిత్యుడు మేషరాశిని విడిచిపెట్టి వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనినే వృషభ సంక్రాంతి అంటారు. భానుడు రాశి మార్పు కారణంగా ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం. 

మేషరాశి
సూర్యుడి రాశి మార్పు మేష రాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. మీపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. బిజినెస్ మెుదలుపెట్టడానికి ఇదే అనుకూల సమయం. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మీరు విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు.
సింహరాశి 
ఈ రాశికి అధిపతి సూర్యుడే. దీని కారణంగా ఈ రాశి వారు ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. వ్యాపారులు భారీగా లాభపడతారు. మీ కెరీర్ మునుపటి కంటే అద్భుతంగా ఉంటుంది. 
కన్యా రాశి
ఆదిత్యుడి గోచారం కన్యారాశి వారికి చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. మీ జాతకంలోని తొమ్మిదవ ఇంట్లో సూర్యుడు సంచరించబోతున్నాడు. దీంతో మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. 

Also Read: Guru Gochar 2023: పుష్కర కాలం తర్వాత కీలక రాజయోగం.. ఈ రాశులకు కలిసిరానున్న కాలం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News