KL Rahul Ruled Out of IPL 2023: ఐపీఎల్ 2023 మాత్రమే కాదు.. డబ్ల్యూటీసీ ఫైనల్‌ నుంచి కూడా కేఎల్‌ రాహుల్‌ ఔట్‌!

Lucknow Super Giants Captain KL Rahul Ruled Out of IPL 2023 and WTC Final 2023. కేఎల్ రాహుల్‌ ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2023 సీజన్‌లో మిగితా మ్యాచ్‌లు దూరం అయ్యాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : May 5, 2023, 05:15 PM IST
KL Rahul Ruled Out of IPL 2023: ఐపీఎల్ 2023 మాత్రమే కాదు.. డబ్ల్యూటీసీ ఫైనల్‌ నుంచి కూడా కేఎల్‌ రాహుల్‌ ఔట్‌!

LSG Captain KL Rahul out from IPL 2023 and WTC Final 2023: ఐపీఎల్ 2023లో ల‌క్నో సూప‌ర్ గెయింట్స్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ల‌క్నో కెప్టెన్ కేఎల్ రాహుల్‌ ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2023 సీజన్‌లో మిగితా మ్యాచ్‌లు దూరం అయ్యాడు. అంతేకాదు జూన్ నెలలో ఆస్ట్రేలియాతో జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ 2023కి రాహుల్‌ దూరమయ్యాడు.  ఐపీఎల్ 2023, డబ్ల్యూటీసీ ఫైనల్‌ 2023 నుంచి తాను వైదొలుగుతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా రాహుల్ ప్రకటించాడు. వైద్యుల సలహా మేరకు తొడ భాగంలో శస్త్రచికిత్స చేయించుకుంటున్నట్లు పేర్కొన్నాడు.

సోమవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జ‌రిగిన మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ గెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ గాయపడ్డాడు. బౌండరీ వద్ద బంతిని ఆపబోయే సమయంలో రాహుల్ తొడ కండ‌రాల‌కు గాయమైంది. దాంతో నొప్పితో మైదానంలోనే విలవిలలాడిపోయాడు. ఆ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేయ‌లేక‌పోయాడు. ఆపై బ్యాటింగ్ ఆర్డ‌ర్‌లో చివ‌ర‌లో వ‌చ్చిన రాహుల్.. ఒక్క రన్ కూడా చేయ‌లేక‌పోయాడు. దాంతో లక్నో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. లో స్కోరింగ్ మ్యాచులో కూడా రాహుల్ సేన విజయాన్ని అందుకోలేకపోయింది.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో మ్యాచ్ కోసం ముంబై వెళ్లిన కేఎల్ రాహుల్.. అక్క‌డ స్కానింగ్ చేయించుకున్నాడు. అయితే రాహుల్  గాయం సీరియ‌స్‌గా ఉన్న‌ట్లు వైద్య పరీక్షల్లో తేలింది. దాంతో అతడికి విశ్రాంతిని ఇవ్వాల‌ని టీమ్ మేనేజ్మెంట్ నిర్ణ‌యించింది. రాహుల్‌ గాయంపై ల‌క్నో జ‌ట్టు ఓ ట్వీట్ చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు స‌ర్జ‌రీ అవ‌స‌ర‌మ‌ని, అత‌నికి లాంగ్ బ్రేక్ అవసరం అని పేర్కొంది. రాహుల్‌కు కావాల్సినంత స‌పోర్టు ఇస్తున్నామ‌ని, అత‌ను త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆశిస్తున్న‌ట్లు ల‌క్నో టీమ్ చెప్పింది. మరోవైపు రాహుల్ ఓ పోస్ట్ చేశాడు. తాను శస్త్రచికిత్స చేయించుకుంటున్నట్లు స్వయంగా తెలిపాడు. 

తొడ భాగంలో శస్త్ర చికిత్స చేయించుకుంటున్నట్లు, ఐపీఎల్‌ 2023తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్‌ 2023 నుంచి వైదొలగాల్సి వస్తున్నందుకు నిరాశగా ఉందని కేఎల్ రాహుల్ తెలిపాడు. గాయం నుంచి త్వరగా కోలుకుని తిరిగి జట్టులో చేరేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపిక చేసిన భారత జట్టులోని సభ్యుడు జయదేవ్‌ ఉనద్కత్‌ కూడా గాయం కారణంగా ఐపీఎల్‌ 2023 నుంచి వైదొలిగాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు డౌటే. ఐపీఎల్ 2023 లీగ్ దశ మే 21న ముగుస్తుంది. మే 28న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఆపై డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం భారత జట్టు లండన్‌కు బయలుదేరుతుంది.  జూన్‌ 7న ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆరంభం అవుతుంది. 

భారత జట్టు: 
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, కేఎల్‌ రాహుల్‌ (ఔట్‌), పుజారా, విరాట్‌ కోహ్లి, అజింక్య రహానే, కేఎస్‌ భరత్‌, అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ షమీ, సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌, జయ్‌దేవ్ ఉనద్కత్.

Also Read: Toyota Hyryder Price Hike 2023: 60 వేలు పెరిగిన టయోటా హైరైడర్ ధర.. కొత్త ధరల జాబితా ఇదే!

Also Read: 2023 Budget SUVs: 10 లక్షల లోపు 8 ఎస్‌యూవీలు.. పంచ్, నెక్సాన్, బ్రెజాతో సహా కార్ల జాబితా ఇదే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News