NEET Exam 2023 today: ఇవాళ దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష జరగనుంది. మన దేశంతోపాటు విదేశాల్లోనూ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. భారత్ లో 499 నగరాలు, పట్టణాలతోపాటు.. విదేశాల్లోని 14 నగరాల్లో ఎగ్జామ్ సెంటర్స్ కేటాయించారు. ఈ పరీక్షకు దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో తెలంగాణ నుంచే దాదాపు 70 వేల మంది ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 115 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జాతీయ పరీక్షల సంస్థ వెల్లడించింది. ఇందులో వచ్చిన ర్యాంకుల ఆధారంగానే దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, బీవీఎస్, ఆయుష్, ఏహెచ్ సీట్లతోపాటు ఎయిమ్స్, జిప్ మర్ సీట్లను భర్తీ చేయనున్నారు.
నీట్ ఎగ్జామ్ ఈరోజు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల 20 నిమిషాల వరకు జరగనుంది. మార్నింగ్ 11 గంటల నుంచే పరీక్షా కేంద్రంలోనికి అనుమతించనున్నారు. మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత నిమిషం ఆలస్యమైన ఎగ్జామ్ సెంటర్ లోకి అనుమతించేది లేదని ఎన్టీఏ స్పష్టం చేసింది. ఈ పరీక్షను తెలుగు, హిందీ మరియు ఇంగ్లీష్ తో సహా 13 భాషల్లో రాసే సౌలభ్యం కల్పించారు. ఆడ్మిట్ కార్డుతోపాటు పాస్ పోర్టు సైజు ఫోటోతోపాటు ఏదైనా ఓ గుర్తింపు కార్డును (ఆధార్, పాన్) అభ్యర్థులు తీసుకెళ్లాల్సి ఉంటుంది. వాటర్ బాటిల్, చిన్న శానిటైజర్ ను మాత్రమే మీతోపాటు ఎగ్జామ్ సెంటర్ లోకి తీసుకెళ్లచ్చు. పెన్ను లోపలే ఇస్తారు. మిగతా ఎలాంటి పరికరాలకు అనుమతి లేదని ఎన్టీఏ స్పష్టం చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook