Akhil Akkineni Next Movie: అఖిల్ కోసం రంగంలోకి ప్రభాస్.. భారీ బడ్జెట్ మూవీ ఫిక్స్?

Akhil Akkineni Movie in UV Creations: అఖిల్ పాన్ ఇండియా వైడ్ గా ఏజెంట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫెయిల్ అయ్యాడు. అయితే ఇలాంటి డిజాస్టర్ తర్వాత కూడా అఖిల్ కి మరో సినిమా అవకాశం దక్కుతుందా? అని అందరూ భావించగా ఒక భారీ ప్రాజెక్ట్ సెట్ అయినట్టు తెలుస్తోంది.     

Written by - Chaganti Bhargav | Last Updated : May 9, 2023, 08:40 PM IST
Akhil Akkineni Next Movie: అఖిల్ కోసం రంగంలోకి ప్రభాస్.. భారీ బడ్జెట్ మూవీ ఫిక్స్?

Akhil Akkineni signs another big-budget film after Disaster Agent: అక్కినేని నాగేశ్వరరావు ఎక్కడో గుడివాడ దగ్గరలోని రామాపురం అనే గ్రామంలో పుట్టి ముందుగా నాటకాలు వేస్తూ పేరు తెచ్చుకొని తర్వాత సినిమా హీరోగా మారారు. ఆయన తరువాత ఆయన కుమారుడు అక్కినేని నాగార్జున కూడా హీరోగా మారి తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన అధ్యాయాన్ని లిఖించుకున్నాడు. ఆయన దాదాపు 100 సినిమాల వరకు హీరోగా నటించగా అనేకమంది కొత్త దర్శక నిర్మాతలను పరిచయం చేసిన వ్యక్తిగా కూడా మంచి పేరు సంపాదించారు.

ఇక నాగార్జున తర్వాత తరంలో ఆయన కుమారుడు అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ కూడా హీరోలుగా లాంచ్ అయ్యారు. వీరు మాత్రమే కాకుండా అక్కినేని నాగేశ్వర రావు కుమార్తెల తరుపున యార్లగడ్డ సుమంత్, అనుమోలు సుశాంత్ కూడా తెలుగు తెరకు హీరోలుగా పరిచయమయ్యారు. కానీ వారు అక్కినేని కుటుంబం నుంచి వచ్చినా పెద్దగా పేరు మాత్రం తెచ్చుకోలేకపోయారు.

అయితే నాగచైతన్య మాత్రం కొంతవరకు తండ్రి బాటలో నడుస్తూ వైవిధ్యమైన కథాంశాలు ఎంచుకుంటూ హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేసి చాలావరకు సఫలం అయ్యాడు. అయితే అక్కినేని కుటుంబంలో రాకుమారుడుగా చెప్పుకునే అక్కినేని అఖిల్ మాత్రం ఇప్పటివరకు చెప్పుకోదగ్గ హిట్ సినిమా ఒక్కటి కూడా కొట్టలేకపోయాడు. అక్కినేని అఖిల్ లాంచింగ్ అఖిల్ అనే ఒక భారీ బడ్జెట్ సినిమాతో జరిగింది. వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెరకెక్కించిన దర్శక నిర్మాతలకు భారీ తల నొప్పిగా మిగిలింది.

Also Read: The Kerala Story: 'ది కేరళ స్టొరీ' బ్యాన్ చేసిన వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం.. ఎందుకంటే?

ఆ తర్వాత మిస్టర్ మజ్ను, హలో వంటి సినిమాలు చేసినా అవి కూడా నిర్మించిన వారికి అనేక నష్టాలు తీసుకువచ్చాయి. ఇక అక్కినేని అఖిల్ అనే ఒక వ్యక్తి హీరోగా లాంచ్ అయ్యాడు అనే విషయాన్ని కూడా ప్రేక్షకుల వరకు చాలా వరకు తీసుకువెళ్లడంలో ఫెయిల్ అయ్యాయి. ఈ సినిమాల తర్వాత అక్కినేని అఖిల్ హీరోగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమా చేశారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్గా తెరకెక్కిన ఈ సినిమా అఖిల్ కెరియర్ లో చెప్పుకోదగ్గ సినిమాగా నిలిచింది.

అంటే భారీ బ్లాక్ బస్టర్ ఏమీ కాలేదు కానీ అఖిల్ కెరియర్ లో కొంత కలెక్షన్లు సాధించి హిట్ అయిన సినిమాగా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత అఖిల్ ఏకంగా ఫ్యాన్ ఇండియా వైడ్ గా ఏజెంట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్గా నటించగా అఖిల్ ఒక రా ఏజెంట్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న యువకుడుగా నటించి ఫెయిల్ అయ్యాడు. అయితే ఇలాంటి డిజాస్టర్ తర్వాత కూడా అఖిల్ కి మరో సినిమా అవకాశం దక్కుతుందా? అని అందరూ భావించారు. కానీ స్టార్ కిడ్ కావడంతో ఆయనతో సినిమా చేసేందుకు మరో బడా నిర్మాణ సంస్థ ముందుకు వచ్చింది. మూవీ క్రియేషన్స్ సంస్థ అక్కినేని అఖిల్ తో సినిమా చేయడానికి అగ్రిమెంట్ రాసుకుంది.

ప్రభాస్ సన్నిహితులచే నడపబడుతున్న ఈ యూవీ క్రియేషన్స్ సంస్థ అఖిల్ తో ధీర అనే పేరుతో ఉన్న ఒక సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి యూవీ క్రియేషన్స్ లో ముందు భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే వచ్చాయి. కానీ తరువాత తరువాత చిన్న చిన్న సినిమాలను కూడా నిర్మిస్తూ వస్తున్నారు. అయితే అఖిల్ సినిమాని మాత్రం భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నట్లుగా తెలుస్తోంది. అది కూడా ఒక కొత్త దర్శకుడుతో నిర్మించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఏజెంట్ లాంటి డిజాస్టర్ తర్వాత అఖిల్ కి అవకాశం దక్కుతుందా అని అందరూ అనుమాన పడిన నేపథ్యంలో ఇప్పుడు ఆయనతో సినిమా చేసేందుకు యూవీ క్రియేషన్స్ ముందుకు రావడం ఆసక్తికరంగా మారింది. ఇక ఒకరకంగా అక్కినేని వారసుడికి ప్రభాస్ అండగా నిలుస్తున్నాడని ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో జరుగుతోంది.

Also Read: Sonia Balani: 'ది కేరళ స్టోరీ'లో ముస్లిం అమ్మాయిగా నటించిన సోనియా బలానీ మోడ్రన్ డ్రెస్సుల్లో అదిరిపోయింది చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News