Jagtial SI Anil Kumar: ఎస్ఐ అనీల్‌ని విధుల్లోకి తీసుకోవాలి.. లేదంటే.. గొల్ల కురుమల హెచ్చరిక

Suspended Jagtial SI Anil Kumar: జగిత్యాల రూరల్ ఎస్ఐ అనీల్ యాదవ్ సస్పెన్షన్ వెంటనే ఎత్తివేసి విధుల్లోకి తీసుకోవాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా గొల్ల కురుమ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం జగిత్యాల ప్రెస్ క్లబ్ ఆవరణలో గొల్ల కురుమల సమావేశం అనంతరం ప్రకటన విడుదల చేశారు.

Last Updated : May 13, 2023, 04:53 AM IST
Jagtial SI Anil Kumar: ఎస్ఐ అనీల్‌ని విధుల్లోకి తీసుకోవాలి.. లేదంటే.. గొల్ల కురుమల హెచ్చరిక

Suspended Jagtial SI Anil Kumar: జగిత్యాల రూరల్ ఎస్ఐ అనీల్ యాదవ్ సస్పెన్షన్ వెంటనే ఎత్తివేసి విధుల్లోకి తీసుకోవాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా గొల్ల కురుమ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం జగిత్యాల ప్రెస్ క్లబ్ ఆవరణలో గొల్ల కురుమల సమావేశం అనంతరం ప్రకటన విడుదల చేశారు. బస్సులో ఇద్దరు మహిళల మధ్య జరిగిన వివాదంలో ఎస్ఐ అనీల్ తప్పేమిలేకున్నా ఓ వర్గానికి చెందిన అసత్యపు ఆరోపణలతో విచారణ జరపకుండా సస్పెన్షన్ చేయడం బిసి వర్గాలకు, యాదవ కులానికి తీరని అన్యాయమన్నారు. ఈ సంఘటనను యాదవ కులాలు సంఘటితంగా ఖండిస్తున్నాయన్నారు. 

అనీల్ కు గొల్ల కురుమలందరు అండగా ఉంటామని తిరిగి విధుల్లోకి తీసుకొనే వరకు మా పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఎస్ఐ అనీల్ కు జరిగిన అన్యాయం కేవలం అతనొక్కడికి జరిగిన అన్యాయం కాదని యావత్ హిందూ సమాజంపై జరిగిన కుట్ర పూరిత చర్యగా వారు పేర్కొన్నారు. ఈ సంఘటనపై హిందూ సమాజం, కులాలు రాజకీయాలకు అతీతంగా సంఘటితమై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. 

ప్రభుత్వం ఒక వర్గం నాయకుల ఒత్తిడితో తీసుకున్న అనాలోచిత నిర్ణయం ప్రభుత్వ ఉద్యోగుల్లో అభద్రతభావానికి దారితీస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అక్రమ సస్పెన్షన్ ను 24 గంటల్లోగా ఎత్తివేసి విధుల్లోకి తీసుకోకుంటే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణ చేపడతామని యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధికార ప్రతినిధి కొక్కు దేవేందర్ యాదవ్, జిల్లా అధ్యక్షులు పలుమారు మల్లేష్ యాదవ్, జిల్లా అధ్యక్షులు బల్కం మల్లేష్ యాదవ్ లు హెచ్చరించారు.

వీరివెంట జాతీయ ప్రతినిధులు జడల శ్రీనివాస్ యాదవ్, వాసం మల్లేష్ యాదవ్, కొమ్మన తిరుపతి యాదవ్, గుంటి గంగారాం కురుమ, రాష్ట్ర కార్యదర్శులు బొబ్బిలి వెంకట స్వామి యాదవ్, మనోజ్ కుమార్ యాదవ్, ఉద్యోగ సంఘాల నాయకులు వేల్పుల స్వామి యాదవ్, జాగృతి జిల్లా అధ్యక్షులు గనవెని మల్లేష్ యాదవ్, బైరి మహేష్, బండ మల్లేష్ యాదవ్, కొక్కెర మల్లేష్ యాదవ్, చిర్రం ప్రకాష్, దండవేని గంగమల్లు యాదవ్, అసారి మల్లేష్ యాదవ్ తోపాటు వంద మంది గొల్ల కురుమ కులస్తులు పాల్గొన్నారు.

Trending News