Mosambi Juice For Weight Loss: ప్రస్తుతం వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరగడం కారణంగా చాలా మంది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి పలు రకాల డ్రింక్స్ తాగుతూ ఉంటారు. చాలా మందికి ఆరెంజ్ జ్యూస్ అంటే చాలా ఇష్టం. పెద్దవారే కాకుండా వేసవిలో పిల్లలు కూడా ఈ రసాన్ని తాగేందుకు ఇష్టపడతారు. ప్రతి రోజు ఎండకాలంలో మోసంబి జ్యూస్ తాగడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ జ్యూస్‌లో విటమిన్ సి, పొటాషియం, జింక్, కాల్షియం, ఫైబర్, కాపర్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వేసవి కాలంలో వచ్చే అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఈ రసం తాగడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే:
బరువు తగ్గడం:
ప్రస్తుతం చాలా మంది శరీర బరువు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఆరెంజ్ జ్యూస్‌ను తాగాల్సి ఉంటుంది. ఈ జ్యూస్‌లో తేనె కలిపి తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గుతారని నిపుణులు తెలుపుతున్నారు.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
మోసంబి జ్యూస్‌లో విటమిన్ సి అధిక పరిమాణలో లభిస్తాయి. కాబట్టి వేసవి కాలంలో వచ్చే వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీర సామర్థ్యాన్ని పెంచేందుకు సహాయపడతాయి. కాబట్టి ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు ఆరెంజ్ జ్యూస్ రసాన్ని తాగాల్సి ఉంటుంది.
చర్మ సమస్యలకు చెక్:
చర్మ సమస్యలను తగ్గించేందుకు మోసంబి రసం కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి చర్మ సమస్యలను తగ్గించేందుకు సులభంగా సహాయపడుతుంది. ఈ రసం ప్రతి రోజు తాగడం వల్ల మచ్చలు, మొటిమల సమస్యలు కూడా దూరమవుతాయి.
జీర్ణక్రియ సమస్యలను తగ్గిస్తుంది:
జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో అజీర్ణం, గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి తప్పకుండా విటమిన్ సి అధిక పరిమాణంలో లభించే ఆరెంజ్ జ్యూస్‌ను తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు తీవ్ర మలబద్ధకం వంటి సమస్యలను కూడా సులభంగా నియంత్రిస్తాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి