Karnataka CM Siddaramaiah: అధికారిక ప్రకటన.. కర్ణాటక సీఎంగా సిద్దరామయ్య! ఒకే ఒక్క డెప్యూటీ సీఎం

Siddaramaiah to take oath as Karnataka CM on May 20. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కర్ణాటక సీఎంగా ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది.   

Written by - P Sampath Kumar | Last Updated : May 18, 2023, 12:48 PM IST
Karnataka CM Siddaramaiah: అధికారిక ప్రకటన.. కర్ణాటక సీఎంగా సిద్దరామయ్య! ఒకే ఒక్క డెప్యూటీ సీఎం

AICC declares Siddaramaiah as next Karnataka CM, DK Shivakumar is Deputy CM: కర్ణాటక సీఎం ఎవరనే అంశంపై కొనసాగుతన్న ఉత్కంఠకు తెరపడింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కర్ణాటక సీఎంగా ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ 20న సిద్ధరామయ్య సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ డెప్యూటీ సీఎంగా ఉంటారని కాంగ్రెస్‌ అధిష్టానం గురువారం అధికారిక ప్రకటన చేసింది. దీంతో పాటు కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగానూ శివకుమార్‌ కొనసాగనున్నారు. ఇక కర్ణాటకకు ఒకే ఒక్క డెప్యూటీ సీఎం ఉంటాడని కాంగ్రెస్‌ స్పష్టం చేసింది. 

కర్ణాటక ప్రభుత్వ ఏర్పాటుపై (Karnataka CM Siddaramaiah) బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఏకాభిప్రాయం కుదిరింది. గురువారం మధ్యాహ్నం పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కర్ణాటక వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ రణ్‌దీప్‌ సుర్జేవాలా మీడియా సమావేశం ఏర్పాటు చేసి సీఎం పేరును ప్రకటించారు. డిప్యూటీ సీఎం పదవికి డీకే శివకుమార్‌ అంగీకరించడం వెనక సోనియా గాంధీ ఉందని తెలుస్తోంది. డెప్యూటీ సీఎం పదవికి ఓకే చేసేలా ఆయన్ను సోనియా బుజ్జగించినట్లు  కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. 

కేసీ వేణుగోపాల్‌ మాట్లాడుతూ... 'కర్ణాటక విజయం కాంగ్రెస్‌కు ఉత్సాహాన్ని ఇచ్చింది. పార్టీ హైకమాండ్‌ సహా నేతలందరూ ఎంతో కృషి చేశారు. మాది ప్రజాస్వామ్య పార్టీ. కర్ణాటక కాంగ్రెస్‌లో గొప్ప నేతలు ఉన్నారు. మే 14న కర్ణాటక శాసనసభాపక్ష సమావేశం నిర్వహించాం. అందులో సీఎం ఎవరనేదానిపై ఎమ్మెల్యేల అభిప్రాయం సేకరించాం. సీఎంగా సిద్ధరామయ్య పేరును అధిష్ఠానం ఖరారు చేసింది. ఏకైక డెప్యూటీ సీఎంగా డీకే శివకుమార్‌ బాధ్యతలు చేపడుతారు. అంతేకాదు రాష్ట్ర పీసీసీ అధ్యక్ష బాధ్యతలను కూడా ఆయనే నిర్వహిస్తారు. వచ్చే ఏడాది పార్లమెంట్‌ ఎన్నికల వరకు శివకుమార్‌ ఈ బాధ్యతల్లో కొనసాగుతారు'అని తెలిపారు.

గురువారం (మే 18) రాత్రి బెంగళూరులో కాంగ్రెస్‌ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేలు అధికారికంగా ఎన్నుకుంటారు. ఆపై తమ నిర్ణయాన్ని గవర్నర్‌కు అందజేయనున్నారు. మే 20న నూతన సీఎంగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. వీరితో పాటు మరికొంత మంది ప్రమాణస్వీకారం కూడా ఉండనుంది. 

Also Read: SRH vs RCB Dream11 Prediction: హైదరాబాద్‌తో బెంగళూరు కీలక మ్యాచ్.. డ్రీమ్11 టీమ్ ఇదే! కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్

Also Read: XUV400 Vs Nexon EV: టాటా నెక్సాన్ ఈవీ vs మహీంద్రా ఎక్స్‌యూవీ400.. బ్యాటరీ, రేంజ్ వివరాలు ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News