White Jamun For Weight Loss: వేసవి కాలంలో నేరేడు పండ్లు అధికంగా లభిస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో నేరేడు పండ్లు చాలా రకాలుగా లభిస్తున్నాయి. ముఖ్యంగా భారత్‌లోని కొన్ని మార్కెట్లలో తెల్ల నేరేడు పండ్లు కూడా లభిస్తున్నాయి. వీటిని తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసేందుకు సహాయపడతాయి. ఈ పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికేకాకుండా చర్మానికి ప్రభావంతంగా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
తెల్ల నేరేడు పండ్ల ప్రయోజనాలు:
చర్మానికి మేలు చేస్తుంది:
తెల్ల నేరేడు పండ్లు తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యవంతంగా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. చిన్న వయసులోనే ముడతల సమస్యలతో బాధపడేవారికి తెల్ల నేరేడు పండ్లు సహాయపడతాయి. ఇందులో ఉండే గుణాలు తీవ్ర చర్మ సమస్యలు దూరం చేస్తుంది.
Also Read: Bhuma Akhila Priya Reddy: భూమా అఖిలప్రియకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
చెడు కొలెస్ట్రాల్‌కు చెక్:
తెల్ల నేరేడులో నియాసిన్ పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారికి ఈ పండ్లు ఔషధంగా పని చేస్తాయి. అంతేకాకుండా ఇందులో ఉండే మూలకాలు గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా సహాయపడుతుంది. కాబట్టి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తెల్ల నేరేడు పండ్లను తీసుకోవాల్సి ఉంటుంది.
శరీర బరువుకు చెక్:
ఈ పండ్లలో తక్కువ కేలరీలు, ఫైబర్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి శరీర బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు డైట్ ఈ ఆహారాలను చేర్చుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు. ఇందులో ఉండే ఫైబర్ పరిమాణాలు జీర్ణక్రియ సమస్యలను కూడా దూరం చేస్తాయి.
Also Read: Bhuma Akhila Priya Reddy: భూమా అఖిలప్రియకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి