Health Tips: దేశంలో ఇప్పుడు ప్రతి యేటా హార్ట్ ఎటాక్, ఒబెసిటీ, కేన్సర్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితి కారణం చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి మాత్రమే. అందుకే ఎప్పుడూ హెల్తీ ఫుడ్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. మరీ ముఖ్యంగా స్పిరులినా అవసరం, ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా వివరిస్తున్నారు.
స్పిరులినా అనేది నీళ్లలో ఉండే వనమూలిక అని చెప్పవచ్చు. నదులు, సరస్సులు, జలపాతాల్లో, సముద్రంలో ఉంటుంది. ఇదొక ఔషధ మొక్కగా చెప్పవచ్చు. ఆయుర్వేదశాస్త్రంలో దీనికి విశిష్ట ప్రాధాన్యత ఉంది. స్పిరులినా తీసుకోవడం ద్వారా కేన్సర్, గుండె పోటు వంటి ప్రాణాంతక వ్యాధుల్ని అరికట్టవచ్చని తెలుస్తోంది. స్పిరులినా ప్రయోజనాల గురించి పూర్తిగా తెలుసుకుందాం..
మధుమేహం నియంత్రణ
మధుమేహం వ్యాధిగ్రస్థులకు స్పిరులినా అత్యద్భుతంగా పనిచేస్తుంది. రోజూ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల డయాబెటిస్ నియంత్రణలో ఉండటమే కాకుండా స్వెల్లింగ్ సమస్య కూడా దూరమౌతుంది. ముఖ్యంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.
గుండెపోటుకు చెక్
స్పిరులినా తినడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. దాంతో రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఎప్పుడైతే రక్తపోటు తగ్గుతుందో గుండెపై అనవసర ఒత్తిడి ఉండదు. అటు రక్త సరఫరా కూడా ఏ విధమైన ఆటంకం లేకుండా ఉంటుంది. గుండెపోటు ముప్పు తగ్గుతుంది.
అధిక బరువుకు చెక్
నీళ్లలో పుష్కలంగా కన్పించే స్పిరులినాలో బీటా కెరోటిన్, ఫ్యాటీ యాసిడ్స్, క్లోరోఫిల్ సహా ఇతర న్యూట్రియంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటివల్ల బరువు తగ్గడంలో ఉపయోగమౌతుంది. స్పిరులినా తినడం వల్ల కేవిటీ తగ్గి చాలాసేపు ఆకలేయదు. దాంతో బరువు తగ్గే అవకాశాలున్నాయి.
కేన్సర్ నుంచి సంరక్షణ
స్పిరులినా అనేది కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల్ని కూడా అరికడుతుంది. కేన్సర్ అనేది సాధారణంగా తొలి దశలో తెలియదు. తెలిసేసరికి వ్యాధి ముదిరి ఉంటుంది. ప్రాణాలు పోతాయి. స్పిరులినాలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుతో శరీరాన్ని ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేయవచ్చు. తద్వారా కేన్సర్ ముప్పు తగ్గుతుంది.
Also read: Neem Benefits: వేపను రోజూ క్రమం తప్పకుండా ఇలా తీసుకుంటే సకల వ్యాధులకు దూరం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook