IPL 2023: ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకూ ఎన్నడూ జరగని అరుదైన రికార్డును, సమీప భవిష్యత్‌లో మరెవరూ చేయలేని ఫీట్‌ను చెన్నై సూపర్‌కింగ్స్ సాధించింది. ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ 14 సీజన్‌లు ఆడిన చెన్నై పలు ఇతర ఫీట్లను కూడా సాధించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్‌కింగ్స్ మరోసారి ఫైనల్‌కు చేరింది. క్వాలిఫయర్ -1లో డిపెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ జట్టుని మట్టికరిపించి నేరుగా ఫైనల్‌లో దూసుకెళ్లింది. ఇక ఓటమిపాలైన గుజరాత్ టైటాన్స్ జట్టుకు మరో అవకాశం ఉంది. ఇవాళ ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజేతతో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. ఇందులో విజయం సాధించిన జట్టు నేరుగా ఫైనల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌తో తలపడనుంది. చెన్నై సూపర్‌కింగ్స్ ఐపీఎల్‌లో ఫైనల్‌కు చేరడం ఇది పదవసారి. మరే ఇతర జట్టుకు సాధ్యం కాని రికార్డు ఇది.
చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు ఇప్పటి వరకూ పదిసార్లు ఫైనల్‌కు చేరుకోగా నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్ గెల్చుకుంది. ఐదుసార్లు రన్నరప్‌గా నిలిచింది.
ఐపీఎల్ టోర్నీలో అత్యధికంగా 12 సార్లు ప్లే ఆఫ్ అర్హత సాధించిన జట్టుగా చెన్నై సూపర్‌కింగ్స్ నిలిచింది. అది కూడా 14 సీజన్లు మాత్రమే ఆడి 12 సీజన్లలో ప్లే ఆఫ్ చేరింది. కేవలం రెండు సార్లు అంటే 2020, 2022లో లీగ్ దశలో సీఎస్కే పోటీ నుంచి నిష్క్రమించింది. 2016, 2017 సీజన్లలో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు ఆడనే లేదు.
చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు ఇప్పటి వరకూ 2008,2010,2011,2012,2013, 2015,2018,2019,2021,2023 సీజన్లలో ఫైనల్‌కు చేరింది.
ఎప్పుడు ఎవరి చేతిలో గెలుపోటములు
2008లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమితో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. 2009లో మాత్రం సెమీఫైనల్ నుంచి నిష్క్రమించింది. 2010 ఫైనల్స్‌లో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించి టైటిల్ గెల్చుకుంది. 2011 ఫైనల్స్‌లో ఆర్సీబీపై విజయంతో వరుసగా రెండవసారి టైటిల్ గెల్చుకుంది సీఎస్కే. 2012 ఫైనల్స్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో పరాజయంతో రన్నరప్‌గా నిలిచింది సీఎస్కే. తిరిగి 2013 ఫైనల్స్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. 2014లో రెండవ క్వాలిఫయర్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చేతిలో పరాజయం పొందింది. ఇక 2015లో ఫైనల్స్‌లో ముంబై ఇండియన్స్‌పై పరాజయం పాలైంది. 2018లో ఫైనల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించింది. 2019లో ముంబై ఇండియన్స్ జట్టుపై పైనల్స్‌లో పరాజయం పొందింది. 2020లో లీగ్ దశలోనే చెన్నై సూపర్‌కింగ్స్ నిష్క్రమించింది. 2021 ఫైనల్స్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై విజయంతో టైటిల్ గెల్చుకుంది. 2022లో కూడా లీగ్ దశలోనే నిష్క్రమించింది.
Also read: IPL 2023 QF-1: చెన్నై-గుజరాత్ మ్యాచ్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు, కారణాలివే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
IPL 2023: పది సార్లు పైనల్స్‌కు , 12 సార్లు ప్లే ఆఫ్, సీఎస్కే అరుదైన రికార్డు