భారత 72వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీలో వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కొద్దిసేపటి క్రితం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటకు చేరుకొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఎర్రకోట వద్ద వాహనం దిగిన మోదీ... త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరిస్తూ కోటపైకి చేరుకున్నారు. అనంతరం మువ్వెన్నల జెండాను ఎగురువేశారు. ఈ ఘట్టాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి చేరుకున్నారు.
Delhi: Prime Minister Narendra Modi arrives at Red Fort, to address the nation shortly. #IndependenceDayIndia pic.twitter.com/gPvCAgNb7o
— ANI (@ANI) August 15, 2018
PM Narendra Modi unfurls the tricolour at Red Fort. #IndiaIndependenceDay pic.twitter.com/sTogztX64z
— ANI (@ANI) August 15, 2018
ఈ వేడుకకు పలువురు రాజకీయ ప్రముఖులు విచ్చేశారు. ఎర్రకోట వేడుకల్లో పాల్గొనేందుకు మాజీ ప్రధానమంత్రులు మన్మోహన్ సింగ్, హెచ్ డి దేవెగౌడ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్ కె అద్వానీ తదితరులు తరలివచ్చారు.అంతకు ముందు ప్రధాని మోదీ మోదీ 72వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. ఢిల్లీలోని రాజ్ ఘాట్ కు వెళ్లి మహాత్ముడికి నివాళులు అర్పించారు.
Delhi: Prime Minister Narendra Modi pays tribute to Mahatma Gandhi at Rajghat #IndependenceDayIndia pic.twitter.com/Yko8pgJlUX
— ANI (@ANI) August 15, 2018
జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధాని మోదీ