Reduce Hair Fall And Turn White Hair Black: వాతావరణంలో కాలుష్యం రోజు రోజుకు పెరగడం కారణంగా చాలా మందిలో జుట్టు రాలడం సమస్యలు తీవ్రతరమవుతున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన ఆముదం నూనె వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు అన్ని రకాల జుట్టు సమస్యలను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నూనెలో ఉండే ఆయుర్వేద గుణాలు తెల్ల జుట్టు సమస్యలను తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది. అయితే ఈ నూనెను ఎలా వినియోగించాలో ఇప్పడు తెలుసుకుందాం.
జుట్టు రాలడం సమస్యలను తగ్గించే నూనె ఇదే:
తరచుగా జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆముదం వినియోగించాల్సి ఉంటుంది. ఆలివ్ నూనెతో ఆముదం నూనె కలిపి జుట్టుకు అప్లై చేసి మసాజ్ చేయాలి. ఇలా క్రమం తప్పరకుండా చేయడం వల్ల సులభంగా జుట్టు రాలడం ఆగిపోతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.
Also read: AP Schools Summer Holidays: వేసవి సెలవులు పొడగించండి.. సీఎం జగన్‌కు టీడీపీ రిక్వెస్ట్
ఉల్లిపాయ రసాన్ని ఆముదంతో కలిపి జుట్టు అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం సమస్యలు దూరమవుతాయని నిపుణుల చెబుతున్నారు. తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారికి ప్రభావంతంగా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు జుట్టును దృఢంగా చేస్తుంది.
టీ ట్రీ ఆయిల్‌లో ఆముదం నూనెను కలిపి అప్లై చేయడం వల్ల కూడా సులభంగా జుట్టు రాలడం సమస్యలు దూరమవుతాయి. ఇందులో ఉండే గుణాలు జట్టును దృఢంగా చేసి సిల్కీగా చేసేందుకు సహాయపడుతుంది. ఇదే నూనెలో అలోవెరా జెల్‌ను అప్లై చేస్తే తెల్ల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఆముదంలో మెంతి పొడిని మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయడం వల్ల సులభంగా అన్ని రకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా కుదుళ్లలో ఇన్ఫెక్షన్స్ సమస్యలు దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. దీనిని వినియోగించడం వల్ల జుట్టు మృదువుగా కూడా తయారవుతుంది.
Also read: AP Schools Summer Holidays: వేసవి సెలవులు పొడగించండి.. సీఎం జగన్‌కు టీడీపీ రిక్వెస్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook