Natural Skin Care Tips: ఈ ఆయుర్వేద చిట్కాలు అవలంభిస్తే పింపుల్స్, యాక్నే సమస్యకు శాశ్వత పరిష్కారం

Natural Skin Care Tips: నిత్య జీవితంలో ఎదుర్కొనే పలు సమస్యల్లో ఒకటి చర్మ సంరక్షణ. చర్మానికి తగిన రక్షణ లేకపోతే పింపుల్స్, యాక్నే వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. ఇటీవలి కాలంలో టీనేజ్ ప్రధానంగా ఎదుర్కొనే సమస్య ఇదే. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 12, 2023, 10:58 PM IST
Natural Skin Care Tips: ఈ ఆయుర్వేద చిట్కాలు అవలంభిస్తే  పింపుల్స్, యాక్నే సమస్యకు శాశ్వత పరిష్కారం

Natural Skin Care Tips: అందంగా ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ పింపుల్స్, ముడతలు వంటి సమస్యలు తీవ్రంగా బాధిస్తుంటాయి. కాలుష్యం, వివిధ రకాల చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఇది సహజమే. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఆయుర్వేదంలో మంచి పరిష్కారముందంటున్నారు. 

పింపుల్స్, ముడతల సమస్యలకు ఆయుర్వేదంలో మంచి చిట్కాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇటీవలి కాలంలో యువతలో ఈ సమస్య అధికంగా ఉంటోంది. ముఖంపై పింపుల్స్, యాక్నే సమస్యల్ని పరిష్కరించేందుకు వివిధ రకాల క్రీమ్స్ వాడుతుంటారు. అయితే ఇందులో ఉండే కెమికల్స్ వల్ల మొదటికే మోసం రావచ్చు. పింపుల్స్ సమస్య మరింతగా విషమించవచ్చు. అందుకే ఆయుర్వేద పద్ధతులతో పింపుల్స్, యాక్నే వంటి సమస్య.ల్ని ఏ విధమైన దుష్పరిణామాల్లేకుండా  దూరం చేయవచ్చు.  ఆ పద్ధతులేంటనేది ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం..

రోజుకు రెండుసార్లు మీ చర్మాన్ని మైల్డ్, నేచురల్ క్లీన్సర్ సహాయంతో శుభ్రం చేసుకోవాలి. సబ్బు లేదా క్లీన్సర్‌తో చర్మానికి సహజసిద్దమైన ఆయిల్స్‌తో శుభ్రం చేసుకోవాలి. కొన్ని ఆయుర్వేద మూలికలు రక్తాన్ని శుభ్రం చేస్తాయి. స్వెల్లింగ్ సమస్యను తగ్గించి చర్మాన్ని శుభ్రపరుస్తాయి. దీనికోసం వేప, పసుపు, అల్లోవెరా వంటి మూలికలు ఉపయోగపడతాయి. త్రిఫలం కూడా శరీరాన్ని శుభ్రపర్చేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. చర్మ ఆరోగ్యంలో చాలా కీలకమిది. రక్తంలోని విష పదార్ధాలను తొలగించి రక్తాన్ని శుద్ది చేయడంలో ఉపయోగపడుతుంది. అదే సమయంలో మలబద్ధకం సమస్య కూడా పోతుంది. 

చర్మాన్ని శుభ్రపర్చేందుకు అవసరమైన పోషకాలు అందించేందుకు ప్రాకృతిక నేచురల్ హెర్బల్ పేస్ట్ లేదా మాస్క్ ఉపయోగించాలి. దీనికోసం చందనం పేస్ట్, పసుపు పేస్ట్, వేప పేస్ట్ అద్భుతంగా ఉపయోగపడతాయి. ఒత్తిడి, ఆందోళన కూడా పింపుల్స్ సమస్యను పెంచవచ్చు. ఒత్తిడిని తగ్గించేందుకు యోగా, ధ్యానం, శ్వాస ప్రక్రియ వంటివి అలవర్చుకోవాలి. అదే సమయంలో రోజూ తగిన నిద్ర అంటే 7-8 గంటల రాత్రి నిద్ర అవసరం. 

అధిక రక్తపోటు నియంత్రించేందుకు, రక్త సరఫరా మెరుగుపర్చేందుకు, విష పదార్ధాలు తొలగించేందుకు రోజూ తగినంత వ్యాయామం చేయాలి. వ్యాయామం చేసేటప్పుడు చెమట్లు పట్టడం కూడా మంచిదే. ముఖాన్ని తరచూ ముట్టుకోకూడదు. దీనివల్ల బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. పింపుల్స్  సమస్య పెరగవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవాలి. రోజూ తగినంతగా నీళ్లు తప్పకుండా తాగాలి. రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీళ్లు తాగాలి. ఈ పద్ధతులు క్రమం తప్పకుండా పాటిస్తే ముఖంపై ఏర్పడే పింపుల్స్, యాక్నే వంటి సమస్యలుసులభంగా తగ్గిపోతాయి.

Also read: Skin Care Tips: రాత్రి వేళ పాలతో ఫేషియల్, ఉదయం లేవగానే మిళమిళలాడటం ఖాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News