Nigeria Boat Capsizes: సౌత్ ఆఫ్రికాలోని నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 103 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారుల నుంచి సమాచారం అందుతోంది. ఉత్తర నైజీరియా నుంచి 200 మందికి పైగా ప్రజలు నైజర్ నదిపై పడవలో పెళ్లికి తిరిగి వస్తుండగా.. ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఓవర్ లోడ్ కారణంగా బోటు ఒక్కసారిగా బోల్తా పడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. నీటమునిగిన వారిని కాపాడే ప్రయత్నం చేశారు. దాదాపు వంద మందిని రక్షించారు. చనిపోయిన మృతదేహాలను వెలికితీస్తున్నారు. మరొకొందరు గల్లంతైనట్లు సమాచారం.
క్వారా రాష్ట్రంలోని నైజర్ నదిలో వస్తున్న పడవ.. ఓవర్‌లోడ్ కారణంగా చెట్టును కొమ్మను పడవ ఢీకొనడంతో బోల్తా పడిందని అధికారు చెబుతున్నారు. వివాహానికి హాజరైన బంధువులు నైజర్ నదిని దాటేందుకు ఇగ్బోటి గ్రామం నుంచి పడవ ఎక్కినట్లు వెల్లడించారు. కపడాలో కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయం అయ్యాయని.. వర్షాలు సమయంలోనే ప్రజలు నది దాటేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు.
Also Read: Earthquake In Delhi: భారీ భూకంపం.. ఇళ్ల నుంచి బయటకు జనం పరుగులు
సోమవారం తెల్లవారుజామున మూడు, నాలుగు గంటల మధ్య ప్రమాదం జరిగినట్లు క్వారా పోలీసు ప్రతినిధి అజయ్ ఒకసన్మి తెలిపారు. ప్రమాద ఘటనపై దర్యాప్తునకు ప్రత్యేక కమిటీని నియమించారు. ఒకేసారి 103 మంది మరణించడంతో పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది. మృతుల్లో ఎక్కవ మంది పటిగిలోని ఎబు, జకాన్, క్పడా, కుచలు, సంపి ప్రాంతాలకు చెందినవారిగా గుర్తించారు.
అయితే నైజీరియాలో గతంలోనూ ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. గత నెలలో కూడా ఓవర్ లోడ్ కారణంగా పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది పిల్లలు నీట ముగిని ప్రాణాలు కోల్పోగా.. మరో 30 మంది ఆచూకీ తెలియరాలేదు. వరుస పడవ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా.. ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Also Read: Cyclone Biparjoy: దూసుకువస్తున్న బిపోర్ జాయ్ తుఫాన్.. ఎఫెక్ట్ ఎక్కడంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి