Adipurush Twitter Review: ఆదిపురుష్ ట్విట్టర్ రివ్యూ.. ఆడియన్స్ రియాక్షన్ ఇదే

Adipurush Twitter Review: పాన్‌ఇండియా లెవల్లో భారీ అంచనాల మధ్య ఆదిపురుష్ సినిమా నేడు బాక్సాఫీసు ముందు సందడి మొదలుపెట్టింది. ట్విట్టర్‌లో సినిమా చూసిన ఆడియన్స్ ఉత్సాహంతో రివ్యూలు ఇస్తున్నారు. ప్రభాస్‌ కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్ హిట్ పడిందా..? ఆదిపురుష్ ప్రేక్షకులను మెప్పించిందా..?

Written by - Ashok Krindinti | Last Updated : Jun 18, 2023, 11:19 AM IST
Adipurush Twitter Review: ఆదిపురుష్ ట్విట్టర్ రివ్యూ.. ఆడియన్స్ రియాక్షన్ ఇదే

 Adipurush Twitter Review and Public Talk: రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఆదిపురుష్. ఓం రౌత్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీలో జానకీ దేవిగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్‌ యాక్ట్ చేసింది. టీ సిరీస్ బ్యానర్‌పై భూష‌ణ్ కుమార్ 'ఆదిపురుష్‌'ను నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ సూపర్‌గా ఉండడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. మైథలాజికల్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ మూవీ నేడు (జూన్ 16) ఆడియన్స్ ముందుకు వచ్చింది. త్రీడీ మోష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాల‌జీతో 'ఆదిపురుష్‌'ను డిజైన్ చేశారు. రాఘవుడి పాత్రలో ప్రభాస్ ఎలా మెప్పించాడు..? లంకేశ్వరుడిగా సైఫ్‌ అలీఖాన్ ఆకట్టుకున్నాడా..? ట్విట్టర్‌లో అభిమానుల రియాక్షన్ ఎలా ఉంది..? ఓ లుక్కేయండి..

ట్విట్టర్‌లో ఆదిపురుష్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రస్తుత తరానికి మూవీని రూపొందించారంటూ అభినందిస్తున్నారు. స్క్రీన్‌ ప్లే, మ్యూజిక్ సూపర్‌గా ఉన్నాయంటూ రివ్యూ ఇస్తున్నారు. కొన్ని సీన్లలో గూజ్ బమ్స్‌ వస్తాయని కామెంట్స్ చేస్తున్నారు. వీఎఫ్ఎక్స్‌ ఇంకా సూపర్‌గా చేసి ఉండొచ్చని అంటున్నారు. యాక్షన్ సీన్స్ అద్భుతంగా పొగిడేస్తున్నారు. ఓ ఫైట్ సీన్‌ను కూడా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

థియేటర్స్ మొత్తం జైశ్రీరామ్ నినదాలతో మారోమోగిపోతున్నాయి. జైశ్రీరామ్ అంటూనే సినిమా చూసి బయటకు వస్తున్నారు. ఆరేళ్ల తరువాత ప్రభాస్ ఫ్యాన్స్‌ ఫైర్ మీద ఉన్నారంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.

ఫస్ట్ హాఫ్ బాగుందని.. సెకండాఫ్ మధ్యలో కాస్త ఫ్లాట్‌గా ఉందని మరో నెటిజన్ రివ్యూ ఇచ్చాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం డ్రామా బాగుంటుందని.. కానీ సెకండాఫ్‌లో వీఎఫ్‌ఎక్స్, లాంగ్ క్లైమాక్స్ ఫైట్ తప్ప మరేమీ లేదన్నాడు. అయితే మ్యూజిక్ సూపర్‌గా ఉందని.. సినిమాను నిలబెడుతుందన్నాడు. తన రేటింగ్: 2.5/5 అని ఇచ్చాడు. 

సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉందని అంటున్నారు.. బీజీఎం, విజువల్స్, గ్రాఫిక్స్, ఫైట్ సీక్వెన్స్ చూస్తే గూజ్ బమ్స్ పక్కా అని మరో అభిమాని కామెంట్ చేశాడు.

భారతీయ సినిమాకు ఆదిపురుష్ ఎంతో గ్వరకారణమని ఓ అభిమాని అన్నాడు. ప్రభాస్ యాక్టింగ్ సూపర్‌గా ఉందన్నాడు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ నెక్ట్స్‌ లెవల్లో ఉందన్నాడు. హనుమాన్ సినిమాను ర్యాంపు ఆడించాడు. కొన్ని 3d సీన్లు కూడా అద్భుతంగా ఉన్నాయని ప్రశసించాడు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News