8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో జీతం భారీగా పెరగనుంది. కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకు 8వ వేతన సంఘం అమలు చేయవచ్చనే వార్తల నేపధ్యంలో ఈ అంచనాలు వస్తున్నాయి. ఇది అమలు జరిగితే దేశవ్యాప్తంగా లక్షలాది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో నేషనల్ పెన్షన్ సిస్టమ్ విషయంలో చర్చ నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి యేటా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండుసార్లు డీఏ పెంచుతూ వస్తోంది. ఇది 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు జరుగుతోంది. మీరు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైతే ఈ వార్త మీ కోసమే. ఇప్పటి వరకూ 8వ వేతవ సంఘం గురించి అధికారికంగా ఏ విధమైన ప్రకటన విడుదల కాలేదు. కానీ త్వరలో 8వ వేతన సంఘం అమలు జరగవచ్చని అంచనాలున్నాయి.
కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని ఇంకా ఏర్పర్చాల్సి ఉంది. ఈ ఏడాదిలోనే 8వ వేతన సంఘం ఏర్పాటు జరగనుందని సమాచారం. ప్రస్తుతం ఉద్యోగులకు అమలు చేస్తున్న 7వ వేతన సంఘం 2013లో ఏర్పాటైంది. కానీ అమలైంది మాత్రం 2016లో. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో భారీగా పెరుగుదల వచ్చింది. ఇప్పుడు మరోసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగ వాతావరణం కలగనుంది. 8వ వేతన సంఘం సిఫార్సులు ప్రతి 10 ఏళ్ల తరువాత అమలు జరుగుతుంటాయి. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే 8వ వేతన సంఘం ఏర్పాటుపై అధికారికంగా ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది. వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలుండటంతో ఈలోగా 8వ వేతన సంఘం అమలు చేసి ప్రయోజనం పొందాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం బేసిక్ శాలరీగా 18 వేల రూపాయలు ఇస్తుండగా గరిష్టంగా 56,900 రూపాయలుంది. కొత్త వేతన సంఘం అమలయ్యాక సిబ్బంది కనీస జీతం పెరగాల్సి ఉంది. దాంతోపాటే వేతన సంఘం నివేదికలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌పై కూడా నిర్ణయం తీసుకోవచ్చు. 8వ వేతన సంఘం డిమాండ్ విషయంలో ఉద్యోగ సంఘాలు త్వరలోనే ప్రభుత్వానికి వినతి పత్రం ఇవ్వనున్నాయని సెంట్రల్ ఎంప్లాయిస్ యూనియన్ తెలిపింది. ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించని పక్షంలో ఆందోళనకు దిగనున్నామని హెచ్చరించింది.
Also read; Indigo Deal: ఏవియేషన్ చరిత్రలో అతిపెద్ద డీల్, 5 వందల విమానాల కొనుగోలుకు ఇండిగో ఆర్డర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook