Hair Fall: ఏం చేసినా జుట్టు రాలడం ఆగడం లేదా? బట్టతలతో బాధపడుతున్నారా.. అన్నిటికీ ఒకటే పరిష్కారం!

Hair Fall Control Ayurvedic Oil: ఆధునిక జీవనశైలి కారణంగా వచ్చే తీవ్ర జుట్టు సమస్యలను తగ్గించుకోవడానికి మార్కెట్లో రసాయనాలతో కూడిన ప్రొడక్ట్స్ వినియోగిస్తున్నారు.  ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ నూనెను వినియోగించండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 20, 2023, 09:20 PM IST
Hair Fall: ఏం చేసినా జుట్టు రాలడం ఆగడం లేదా? బట్టతలతో బాధపడుతున్నారా.. అన్నిటికీ ఒకటే పరిష్కారం!

Hair Fall Control Ayurvedic Oil: ఆధునిక జీవనశైలి కారణంగా చిన్నా పెద్ద తేడా లేకుండా అందరిలోనూ జుట్టు సమస్యలు వస్తున్నాయి. కొందరిలో జుట్టు నిర్జీవంగా మారి క్రమంగా పోవడం, రంగు కోల్పోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు తరచుగా మార్కెట్లో లభించే రసాయనాలతో కూడిన ప్రొడక్ట్స్ ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించడం వల్ల భవిష్యత్తులో చాలా రకాల జుట్టు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

జుట్టు నిర్జీవంగా మారితే తప్పకుండా ఆయుర్వేద మూలికలతో తయారుచేసిన రెమెడీస్ ని వినియోగించడం చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.  ప్రతిరోజు తీసుకునే ఆహారాల్లో తప్పకుండా పండ్లు, చిరు ధాన్యాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ జుట్టు సమస్యల నుంచి తొందరగా ఉపశమనం పొందడానికి ఆలివ్ ఆయిల్ ను కూడా వినియోగించవచ్చు. 

Also Read: Weather Updates: భారీ ఎండల నుంచి ఉపశమనం.. ఈ ప్రాంతాల్లో వర్షాలు  

రెగ్యులర్ గా జుట్టుకు ఆలివ్ ఆయిల్ ను వినియోగించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే ఔషధ గుణాలు జుట్టును దృఢంగా చేయడమే కాకుండా చుండ్రు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా జుట్టు దృఢంగా మందంగా కోరుకునేవారు.. ఈరోజు ఈ ఆయిల్ ను జుట్టుకు అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

ఆలివ్ ఆయిల్ కండిషనర్ గా కూడా పనిచేస్తుంది. ఇందులో ఉండే మూలకాలు శరీరంలోని డైహైడ్రోటెస్టోస్టెరాన్ హార్మోన్లను తగ్గించేందుకు సహాయపడతాయి. అయితే ఈ హార్మోన్ పెరగడం వల్ల చాలామందిలో జుట్టు రాలడం, తెల్ల జుట్టు సమస్యలు వస్తాయి. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ఈ హార్మోన్ నియంత్రించే ఆలివ్ ఆయిల్ ని క్రమం తప్పకుండా ఆహారంలో వినియోగించాల్సి ఉంటుంది. ఆలివ్ ఆయిల్ లో యాంటీ ఆక్సిడెంట్లు పరిమాణాలకు కూడా అధికంగా ఉంటాయి.  ఈ నూనెను తరచుగా వినియోగించడం వల్ల జుట్టు కుదుళ్ల నుంచి బలంగా మారుతుంది.

Also Read: Weather Updates: భారీ ఎండల నుంచి ఉపశమనం.. ఈ ప్రాంతాల్లో వర్షాలు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News