Rahu Ketu Nakshtra Transit 2023: రాహు-కేతు నక్షత్ర మార్పుతో ఈ రాశులకు మంచి రోజులు.. మీ రాశి ఉందా?

Rahu Ketu Nakshtra Transit 2023:  ఇటీవల కేతు గ్రహం చిత్రా నక్షత్రంలోకి ప్రవేశించింది. దీని సహచర గ్రహమైన రాహువు అశ్వినీ నక్షత్రంలో సంచరిస్తుంది. ఈ రెండు గ్రహాలు నక్షత్ర మార్పు వల్ల 5 రాశుల వారు ప్రయోజనం పొందనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 28, 2023, 05:48 AM IST
Rahu Ketu Nakshtra Transit 2023: రాహు-కేతు నక్షత్ర మార్పుతో ఈ రాశులకు మంచి రోజులు.. మీ రాశి ఉందా?

Rahu Ketu 2023 Effect: ఆస్ట్రాలజీలో రాహు-కేతువులను ఛాయా గ్రహాలు అని పిలుస్తారు. సాధారణంగా ఈ రెండు గ్రహాలు ఒకే విధమైన ఫలితాలను ఇస్తాయి. ఇటీవల రాహు, కేతువులు తమ నక్షత్ర రాశులను మార్చారు. ప్రస్తుతం రాహువు అశ్వినీ నక్షత్రంలోనూ, కేతువు చిత్రా నక్షత్రంలోనూ సంచరిస్తున్నారు. రాహు-కేతువుల నక్షత్ర మార్పు కొన్ని రాశులకు శుభ ఫలితాలను ఇవ్వనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

మేషరాశి
రాహు-కేతువుల నక్షత్ర మార్పు వల్ల మేష రాశి వారికి మంచి ప్రయోజనాలు పొందుతారు. వీరి కెరీర్ లో ఎదుగుదల ఉంటుంది. మీ దాంపత్య జీవితంలో తలెత్తిన సమస్యలు తొలగిపోతాయి. మీ లవ్ స్ట్రాంగ్ అవుతుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. డబ్బుకు సంబంధించిన సమస్యలు తీరిపోతాయి. 
తులారాశి
రాహు-కేతువుల సంచారం తులారాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు కెరీర్‌లో మంచి పురోగతి సాధిస్తారు. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగులకు ఈ సమయం కలిసి వస్తుంది. సృజనాత్మక, పరిశోధన రంగాల్లో ఉన్నవారు మంచి ఫలితాలను పొందుతారు. ఇతరులతో సంబంధాలు మెరుగుపడతాయి.
వృశ్చిక రాశి
రాహు-కేతువుల నక్షత్రం మారడం వల్ల వృశ్చిక రాశి వారు ఆర్థికంగా బలపడతారు. విదేశాల్లో స్థిరపడాలనే మీ కోరిక నెరవేరుతుంది. మీకు ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. మీరు అనుకున్నది సాధిస్తారు. మీ ప్రణాళికలన్నీ విజయవంతమవుతాయి.

Also Read: Surya Grahan 2023: త్వరలోనే రెండో సూర్యగ్రహణం.. ఈ రాశులపై ప్రతికూల ప్రభావం!

ధనస్సు రాశి
రాహు-కేతువుల సంచారం ధనుస్సు రాశి వారికి లాభాలను ఇస్తుంది. ఈ రాశి వ్యక్తులు మునుపటి కంటే ఆర్థికంగా బలపడతారు. డబ్బును పొదుపు చేస్తారు. మీరు కెరీర్ లో ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉంది.
కుంభ రాశి
రాహు-కేతువుల రాశి మార్పు కుంభ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ వ్యక్తుల కుటుంబంలో సంతోషం, ఐశ్వర్యం పెరుగుతుంది. స్థిర చరాస్తులు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ ఆదాయం పెరుగుతుంది. 

Also Read: July Grah Gochar 2023: జూలై 01 నుండి ఈ 4 రాశులకు డబ్బే డబ్బు... లాభాలే లాభాలు.. మీది ఉందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News