TS Politics: బీఆర్ఎస్‌కు భారీ షాక్.. జడ్పీ ఛైర్మన్, 56 మంది సర్పంచ్‌లు, 26 మంది ఎంపీటీసీలు గుడ్‌బై

ZP Chairman Koram Kanakaiah Resigns: ఖమ్మంలో కాంగ్రెస్ సభ వేళ బీఆర్ఎస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కొత్తగూడెం జడ్పీ ఛైర్మన్‌ కోరం కనకయ్యతోపాటు 56 మంది సర్పంచ్‌లు, 26 మంది ఎంపీటీసీలు బీఆర్ఎస్‌కు రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. రేపు వీరు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Jul 1, 2023, 01:51 PM IST
TS Politics: బీఆర్ఎస్‌కు భారీ షాక్.. జడ్పీ ఛైర్మన్, 56 మంది సర్పంచ్‌లు, 26 మంది ఎంపీటీసీలు గుడ్‌బై

ZP Chairman Koram Kanakaiah Resigns: ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్‌కు మరో షాక్ తగిలింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ ఛైర్మన్ కోరం కనకయ్య అధికార పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కనకయ్యతో పాటు ఆయన అనుచరులు, ఇల్లందు నియోజకవర్గవ్యాప్తంగా పలువురు నాయకులు బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. మొత్తం 56 మంది సర్పంచ్‌లు, 26 మంది ఎంపీటీసీలు కారు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. వీరంతా రేపు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆదివారం ఖమ్మంలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు భారీగా జనాలు తరలివస్తారని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ఈ సభకు రాహుల్ గాంధీ ముఖ్యఅతిథిగా హాజరవుతున్న విషయం తెలిసిందే.

 

ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్‌కు మరో షాక్ తగిలింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ ఛైర్మన్ కోరం కనకయ్య అధికార పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కనకయ్యతో పాటు ఆయన అనుచరులు, ఇల్లందు నియోజకవర్గవ్యాప్తంగా పలువురు నాయకులు బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. మొత్తం 56 మంది సర్పంచ్‌లు, 26 మంది ఎంపీటీసీలు కారు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. వీరంతా రేపు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆదివారం ఖమ్మంలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు భారీగా జనాలు తరలివస్తారని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ఈ సభకు రాహుల్ గాంధీ ముఖ్యఅతిథిగా హాజరవుతున్న విషయం తెలిసిందే.

ఖమ్మ సభకు కాంగ్రెస్ పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. జనం సభకు రాకుండా అడ్డుకునేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రజలను సభకు వచ్చేందుకు 1500 ఆర్టీసీ బస్సులు అడిగితే.. అనుమతి ఇవ్వలేదని మండిపడుతున్నారు. ఖమ్మం సభకు ఆర్టీసీ బస్సులు ఇచ్చినా.. ఇవ్వకపోయినా ప్రజలు సభకు రావడం ఆగదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏదీ లేకపోతే నడుచుకుంటూనైనా ఇక్కడి ప్రజలు సభకు వస్తారని అన్నారు. సీఎం కేసీఆర్‌కు తాను సవాల్ విసురుతున్నానని.. బీఆర్ఎస్ పార్టీ సభ కంటే ఎక్కువ మంది సభకు జనం తరలివస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం బహిరంగ సభతోనే బీఆర్ఎస్ పాలనకు సమాధి కడుతామని హెచ్చరించారు.

ఖమ్మం జిల్లాలో 10కి 10 సీట్లలో కాంగ్రెస్ పార్టీని గెలిచిపాంచాలని రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్రంలో 80కి పైగా సీట్లు గెలిపించే బాధ్యత తాము తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి సోనియా గాంధీకి జన్మదిన కానుక ఇద్దామని పార్టీ శ్రేణులను పిలుపునిచ్చారు. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తరువాత ఖమ్మం గడ్డపై ఇక కారు గుర్తు ఉండదని జోస్యం చెప్పారు.  

Also Read: Pawan Kalyan Tholi Prema: పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ రీరిలీజ్.. థియేటర్‌లో ఫ్యాన్స్ రచ్చ రచ్చ  

Also Read: Maharashtra Bus Accident: ఘోర బస్సు ప్రమాదం.. 25 మంది సజీవ దహనం  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x