Maharashtra Bus Accident Latest Updates: మహారాష్ట్రలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. బుల్దానాలోని సింధ్‌ఖేడ్ వద్ద సమృద్ధి మహామార్గ్ ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగి 25 మంది సజీవ దహనమయ్యారు. మరో 8 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు టైర్ పేలి డివైడర్‌ను ఢీకొనడంతో బోల్తా పడింది. అనంతరం బస్సులో నుంచి మంటలు చెలరేగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది.
శనివారం రాత్రి 1.30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు బుల్దానా ఎస్పీ సునీల్ కడసెన్ర్ తెలిపారు. ఘటన సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నారని.. అందులో 25 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఈ ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలు అయ్యాయని.. బుల్దానా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. టైరు పగిలిపోవడంతో బస్సు బోల్తా పడిందని.. ఆ తర్వాత బస్సులో మంటలు చెలరేగాయని తెలిపారు.
Maharashtra | Several feared dead after a bus burst into flames on Samruddhi Mahamarg expressway in Buldhana: Buldhana Police pic.twitter.com/Zs6Mt0tfsT
— ANI (@ANI) July 1, 2023
ప్రమాదానికి గురైన బస్సు విదర్భ ట్రావెల్స్‌కు చెందినది. నాగ్‌పూర్, వార్ధా, యావత్‌మాల్ నుంచి ప్రయాణికులను ఎక్కించుకుని బస్సు పూణెకు వెళ్తోంది. ఈ క్రమంలోనే సింద్‌ఖేదరాజాలోని పింపాల్‌ఖుటా గ్రామ సమీపంలో సమృద్ధి మహామార్గ్ ఎక్స్‌ప్రెస్‌వేపై డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. తరువాత వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు.. నిద్రలోని లేచే సరికి మంటలు చుట్టుముట్టాయి. బయటకు దూకేందుకు యత్నించినా.. అప్పటికే మంటల్లో చిక్కుకుపోయారు.
ఏడీజీ సంజయ్ సక్సేనా ఘటన స్థలానికి చేరుకున్నారు. ముందుగా బస్సు టైరు పగిలిందా లేక బస్సు స్తంభాన్ని ఢీకొట్టి బోల్తా పడి మంటలు చెలరేగిందా అనేది విచారణలో తేలాల్సి ఉందని తెలిపారు. తీవ్రంగా గాయపడిని వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చామని.. చికిత్స కొనసాగుతుందన్నారు. బస్సులోని చాలా మంది ప్రయాణికులు నాగ్‌పూర్, వార్ధా, యవత్మాల్ నుంచి వస్తున్నారని చెప్పారు.
Also Read: Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్‌ను వీడిన అజిత్ అగార్కర్, షేన్ వాట్సన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook