Etela Rajender is BJP's CM candidate: బీజేపీ గెలిస్తే ఈటల రాజేందర్ కొత్త సీఎం ? ఎలాగంటే..

Etela Rajender is BJP's CM candidate: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి ఉన్నట్టుండి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారారు. తెలంగాణ బీజేపిలో ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా ఈటల రాజేందర్ నియమితులయ్యారు. బీజేపి తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటనేది జీ న్యూస్ తెలుగు ఎడిటర్ భరత్ విశ్లేషిస్తూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Written by - Pavan | Last Updated : Jul 5, 2023, 04:02 AM IST
Etela Rajender is BJP's CM candidate: బీజేపీ గెలిస్తే ఈటల రాజేందర్ కొత్త సీఎం ? ఎలాగంటే..

Etela Rajender is BJP's CM candidate: తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి ఉన్నట్టుండి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికొచ్చి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ ఇప్పటివరకు ఆ పార్టీలో చేరికల కమిటీ చైర్మన్‌గా కొనసాగుతుండగా.. అనూహ్యంగా ఆయన్ను మరో కీలక పదవి వరించింది. ఈసారి ఏకంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపిలో చక్రం తిప్పేంత స్థాయి కీలక పదవి దక్కింది. తెలంగాణ బీజేపిలో ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా ఈటల రాజేందర్ నియమితులయ్యారు. 

బీజేపి ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా ఈటల రాజేందర్ నియామకాన్ని జీ న్యూస్ తెలుగు ఎడిటర్ భరత్ విశ్లేషిస్తూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అదేమంటే.. " తెలంగాణలో త్వరలోనే జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒకవేళ బీజేపి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం దక్కించుకుంటే, ఆ ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ముందుండి నడిపించే అవకాశం ఈటల రాజేందర్‌నే వరించే అవకాశాలు ఉన్నాయని.. బీజేపీలో ఈటల రాజేందర్ నాయకత్వాన్ని కోరుకుంటున్న ఒక వర్గం నేతలు, అనుచరులు, కార్యకర్తలు కూడా అదే కోరుకుంటున్నారు " అని భరత్ చెప్పుకొచ్చారు. 

ఈటల రాజేందర్ కోసమే.. 
ఈ అంశంపై భరత్ మాట్లాడుతూ, ఈటల రాజేందర్‌కి బీజేపి అధిష్టానం అప్పజెప్పిన కొత్త పదవి, బాధ్యతలు కేవలం ఆయన కోసం సృష్టించినవిగా అర్థమవుతోందన్నారు. ఇంతకు ముందు ఇలాంటి పోస్ట్ ఒకటి లేకపోవడం.. అలాగే ఇతర రాష్ట్రాల్లోనూ ఎవ్వరికీ ఇలాంటి బాధ్యతలు అప్పగించని బీజేపి అధిష్టానం కేవలం తెలంగాణ విషయంలో ఈటల రాజేందర్‌ కోసం ఒక పోస్టుని ఏర్పాటు చేసి ఆ పోస్టుని ఆయనకు కట్టబెట్టడం వెనుక చాలా తతంగమే జరుగుతోందన్నారు. 

అందుకే బండి సంజయ్‌ని తప్పించారు..
తెలంగాణలో బండి సంజయ్ నాయకత్వంలో బీజేపి ఇప్పటికే హిందూ ఓటు బ్యాంకును పోగేసుకోవడంలో విజయం సాధించిందని.. బండి సంజయ్ నాయకత్వ బాధ్యతలు చేపట్టాకా హుజూరాబాద్ ఉప ఎన్నికలు, దుబ్బాకా ఉప ఎన్నికల్లో బీజేపి విజయం సాధించడమే అందుకు నిదర్శనమని భరత్ చెప్పుకొచ్చారు. అయితే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపి విజయం సాధించి మెజార్టీ సీట్లు గెల్చుకోవాలంటే ఇప్పుడున్న ఓటు బ్యాంకు మాత్రమే సరిపోదు అనే నిర్ధారణకు వచ్చిన బీజేపి హై కమాండ్.. ఇతర పార్టీల్లో చరిష్మా కలిగిన, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా పేరున్న కీలక నేతలను పార్టీలోకి తీసుకొచ్చే నాయకత్వం కావాలని భావిస్తోందన్నారు. 

అదే సమయంలో బీజేపిలో చేరికల కమిటీ చైర్మన్‌గా ఉన్న తాను ఎవరినైనా పార్టీలోకి తీసుకురావాలంటే.. వారికి టికెట్ ఇప్పించే పూచీ తనదేనని ముందుగా హామీ ఇవ్వాల్సి ఉంటుందని.. కానీ కొత్తగా పార్టీలోకి తీసుకొచ్చే నేతలకు టికెట్ ఇచ్చేంత అధికారం కానీ లేదా ఇప్పించేంత స్వేచ్ఛ కానీ తనకు లేవు అనే విషయాన్ని పార్టీ హై కమాండ్ దృష్టికి తీసుకెళ్లడంలో ఈటల రాజేందర్ సక్సెస్ అయ్యారు. అంతేకాకుండా కీలక నేతలను పార్టీలోకి ఆకర్షించడంలో బండి సంజయ్ చురుకుగా వ్యవహరించడం లేదు అనే పేరు కూడా ఉండటంతో.. ఈ పరిస్థితులను రూపు మార్చి పార్టీ అభివృద్ధి కోసం ఈటల రాజేందర్‌కి స్వేచ్ఛను ప్రసాదిస్తూ బీజేపి హై కమాండ్ ఆయన్ని బీజేపి ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా నియమించింది అని భరత్ విశ్లేషించారు. 

ఇది కూడా చదవండి : Etela Rajender First reaction: కొత్త పదవిపై ఈటల రాజేందర్ తొలి రియాక్షన్

అంతేకాకుండా ఈటల రాజేందర్ నియామకం తరువాత కొద్దిసేపటి క్రితం ఈటల వర్గానికి చెందిన కొంతమంది నేతలతో తను మాట్లాడగా.. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే.. ఈటల రాజేందర్‌కే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు, అర్హతలు ఎక్కువగా ఉన్నాయని వారు కోరుకుంటున్నట్టుగా చెప్పారని భరత్ తెలిపారు. అంతేకాదు, కేసీఆర్ చాణక్య వ్యూహాలు బాగా తెలిసిన మనిషిగా, తెలంగాణలో.. అందులోనూ ప్రత్యేకించి బీసీల్లో బలమైన ఓటు బ్యాంకు కలిగిన ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన మాస్ లీడర్‌గా ఈటల రాజేందర్‌కి పేరు ఉండటం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకునే బీజేపి ఆయన్ని ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా నియమించిందన్నారు. ఒకరకంగా బీజేపి తీసుకున్న ఈ నిర్ణయంతో.. "తమ పార్టీ తరుపున ముఖ్యమంత్రి అభ్యర్థి ఈటల రాజేందర్ అవుతారు" అని పార్టీ హై కమాండ్ చెప్పకనే చెప్పిందన్నారు.

ఇది కూడా చదవండి : Zee News Telugu prediction: బీజేపి అధిష్టానం నిర్ణయంపై ముందే చెప్పిన జీ న్యూస్ తెలుగు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News