Pumpkin For Obesity: గుమ్మడికాయతో చేసిన పదార్థాల రుచి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కాయను చాలా మంది హల్వాకు వినియోగిస్తూ ఉంటారు. దీనితో తయారుచేసిన హల్వా నోటికి రుచి అందించడమే కాకుండా చాలా రకాలుగా శరీరానికి ప్రయోజనాలను కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనితో తయారుచేసిన హల్వానే కాకుండా అన్ని రకాల పదార్థాలు శరీరానికి చాలా రకాలుగా సహాయపడతాయి. ముఖ్యంగా గుమ్మడికాయతో తయారు చేసిన రసాన్ని ప్రతిరోజు తాగడం వల్ల ఊబకాయం సమస్య నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. గుమ్మడికాయతో ఇవే కాకుండా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
వాతావరణంలో తేమ పరిమాణాలు ఒక్కసారిగా పెరగడం కారణంగా ఇన్ఫెక్షన్ల ప్రభావం పెరుగుతుంది. దీని కారణంగా చాలామందిలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో జింక్ తో పాటు చాలా రకాల పోషకాలు లభిస్తాయి. దీనితో తయారుచేసిన రసాన్ని తాగడం వల్ల శరీరంలో ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తుంది.
Also read: Kia Seltos Facelift: కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ, అత్యాధునిక ADAS ఫీచర్లతో
రక్తంలోని చక్కర పరిమాణాలను నియంత్రిస్తుంది:
ప్రస్తుతం చాలామంది తీవ్ర మధుమేహం బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు గుమ్మడి నుంచి తీసిన గింజలను ఆహారంలో తీసుకోవడం వల్ల సులభంగా రక్తంలోని చక్కెర పరిమాణాలకు చెక్ పెట్టొచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
శరీర బరువును నియంత్రిస్తుంది:
అధిక బరువు కారణంగా చాలా రకాల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ప్రోటీన్లు ఫైబర్ అధిక పరిమాణంలో ఉండే గుమ్మడికాయ గింజలను ప్రతిరోజు తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి శరీర బరువును నియంత్రించడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా శరీరాన్ని రక్షిస్తాయి.
ఎముకల దృఢత్వం కోసం:
ఆధునిక జీవనశైలి కారణంగా చాలామంది క్యాల్షియం లోపం సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ లోపం నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ప్రతిరోజు క్యాల్షియం అధిక పరిమాణంలో లభించే గుమ్మడి గింజలను ఆహారంలో వినియోగించాల్సి ఉంటుంది. వీటిని వినియోగించడం వల్ల ఎముకలు దృఢంగా మారడమే కాకుండా రక్తపోటు సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
Also read: Kia Seltos Facelift: కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ, అత్యాధునిక ADAS ఫీచర్లతో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook