Home Remedies For Pimples: వీపుపై కురుపులు, దద్దుర్ల సమస్య పెరిగిపోతోందా?, ఎలాంటి ఖర్చు లేకుండా ఇలా 2 రోజుల్లో చెక్‌

Home Remedies For Pimples: తరచుగా వీపుపై కురుపులు, దద్దుర్లు వంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా సౌందర్య నిపుణులు సూచించిన పలు చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. ఈ సమస్య నుంచి సులభంగా అలోవెరా జెల్‌తో కూడా ఉపశమనం కలుగుతుంది. అయితే ఈ హోం రెమిడీస్‌ను ఎలా వినియోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 10, 2023, 01:14 PM IST
Home Remedies For Pimples: వీపుపై కురుపులు, దద్దుర్ల సమస్య పెరిగిపోతోందా?, ఎలాంటి ఖర్చు లేకుండా ఇలా 2 రోజుల్లో చెక్‌

Tips For Flawless Back: ప్రస్తుతం చాలా మందిలో ముఖంపై మొటిమలే కాకుండా వీపుపై కూడా వస్తున్నాయి. అంతేకాకుండా వీపుపై అతిగా కురుపులు వస్తున్నాయి. అయితే వీటి నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో లభించే రసాయనాలతో కూడిన చాలా రకాల ప్రోడక్ట్స్‌ వినియోగిస్తున్నారు. అయితే వీటిని వినియోగించినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా మహిళ ఇలాంటి సమస్యలతో బాధపడేవారు బ్యాక్‌లెస్ డ్రెస్‌లు వేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా సౌందర్య నిపుణులు సూచించిన ఈ కింది చిట్కాలు కూడా పాటించాల్సి ఉంటుంది. ఆ టిప్స్‌ ఎంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.    

ఈ చిట్కాలతో చెక్‌ పెట్టొచ్చు:
అలోవెరా జెల్ :

అలోవెరా జెల్ చర్మానికి చాలా రకాల ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే గుణాలు మొటిమల సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. తరచుగా వేడి కారణంగా వీపుపై దద్దుర్లు, మొటిమలతో బాధపడుతున్నవారు ప్రభావిత ప్రాంతంలో అలోవెరా జెల్‌ని అప్లై చేసి 40 నిమిషాల పాటు అలాగే ఉంచి శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.

Also read: Dark Circles: డార్క్ సర్కిల్స్ మీ అందాన్ని పాడుచేస్తున్నాయా, ఈ చిట్కాలు పాటిస్తే చాలు

తేనె, దాల్చిన చెక్క పొడి:
తేనె, దాల్చిన చెక్క పొడిని రెండింటిని కలిపి ఫేస్‌ ప్యాక్‌లా సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. దీనిని కురుపులు ఉన్న ప్రదేశంలో అప్లై చేసి వాటిని తొలగించాల్సి ఉంటుంది. ఇందులో యాంటీ బాక్టీరియల్ అధిక పరిమాణంలో లభిస్తాయి. దీనిని వినియోగించడం వల్ల స్కిన్‌ సమస్యలు సులభంగా దూరమవుతాయి. 

గ్రీన్ టీ:
ప్రస్తుతం చాలా మంది బరువు తగ్గడానికి గ్రీన్‌ టీలను తాగుతూ ఉంటారు. అయితే ఇది చర్మ సమస్యలను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. గ్రీన్‌ టీని నీటిలో ఉడికించి ప్రభావిత ప్రాంతంలో అప్లై చేసి, ఆరిన తర్వాత మంచి నీటితో శుభ్రం చేయాలి. 

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also read: Dark Circles: డార్క్ సర్కిల్స్ మీ అందాన్ని పాడుచేస్తున్నాయా, ఈ చిట్కాలు పాటిస్తే చాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News