Hyundai Exter Price: హ్యుందాయ్ నుంచి మార్కెట్‌లోకి మైక్రో SUV, ధర, మైలేజ్​ వివరాలు ఇవే

Hyundai Exter On Road Price: హ్యుందాయ్ తమ కస్టమర్స్‌కు శుభ వార్తను అందించింది. ఎప్పటి నుంచో బడ్జెట్‌లో విడుదల చేస్తామని ప్రకటించిన ఎక్స్‌టర్ మైక్రో SUVని ఈ రోజు విడుదల చేసింది. ప్రస్తుతం ఈ కారు ఐదు వేరియంట్స్‌లో లభిస్తోంది. అయితే ఈ SUVకి సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Edited by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 10, 2023, 04:45 PM IST
Hyundai Exter Price: హ్యుందాయ్ నుంచి మార్కెట్‌లోకి మైక్రో SUV, ధర, మైలేజ్​ వివరాలు ఇవే

 

Hyundai Exter On Road Price: అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న హ్యుందాయ్ ఎక్స్‌టర్ మార్కెట్‌లోకి విడుదలైంది. ప్రస్తుతం ఈ మైక్రో SUV ఈఎక్స్‌, ఎస్‌ఎక్స్‌, ఎస్‌ఎక్స్‌(ఓ), ఎస్‌ఎక్స్‌(ఓ) కనెక్ట్‌, ఎస్‌తో ఐదు వేరియంట్స్‌లో లభిస్తోంది. భారత్‌లో దీని ప్రారంభ ధర రూ. 5,99,900  నుంచి ప్రారంభమై టాప్‌ ఎండ్‌ వేరియంట్‌ రూ.9,31,990 ధరకు లభిస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో హ్యుందాయ్ కంపెనీ విడుదల చేసిన SUVల్లో అత్యంత తక్కువ ధర కలిగిన కారు ఇదే. ఈ మిని SUV మార్కెట్‌లో ఇటీవలే విడుదల చేసిన టాటా పంచ్‌, నిస్సాన్‌ మాగ్నెట్‌ కార్లతో పోటీ పడబోతోందని ఆటో నిపుణులు చెబుతున్నారు. 

ఈ ఎక్స్‌టర్ ప్రస్తుతం మొత్తం 5 ట్రిమ్స్‌లో కంపెనీ అందిస్తోంది. ఇందులో టాప్‌ వేరియంట్‌ రూ.9,31,990 ధరతో లభిస్తోంది. హ్యుందాయ్ ఎక్స్‌టర్‌కు ఇప్పటి వరకు దాదాపు 11,000 ప్రి బుకింగ్స్‌ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ కారులో చాలా రకాల స్మార్ట్‌ ఫీచర్స్‌ అందుబాటులో ఉన్నాయి. దీంతో ఈ కారును కొనుగోలు చేసేందుకు కస్టమర్స్‌ ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ రోజు అందుబాటులోకి వచ్చిన ఈ కారు 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో కస్టమర్లకు లభించబోతోంది. దీని ఇంజన్‌ 114 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తిని విడుదల చేస్తుంది. మైక్రో SUVలో ఏఎంటీ గేర్‌బాక్స్‌ పరిచయం చేసిన కార్లలో ఇది మొదటిగా ఆటో నిపుణులు తెలుపుతున్నారు.

Also read: Dark Circles: డార్క్ సర్కిల్స్ మీ అందాన్ని పాడుచేస్తున్నాయా, ఈ చిట్కాలు పాటిస్తే చాలు

ఈ కారు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ ఫీచర్స్‌తో అందుబాటులో ఉంది. అంతేకాకుండా త్వరలోనే సీఎన్‌జీ వేరియంట్‌లో కూడా ఈ కారును విడుదల చేయబోతున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ కారు 83 హార్స్ పవర్‌ను విడుదల చేస్తుంది. ఇది ప్రత్యేకమైన డిజైన్‌ కలిగి ఉండడంతో చూడడానికి ఆకర్షనీయంగా కనిపిస్తోంది. ఈ కారు మరింత ఆకర్శనీయంగా కనిపించేందుకు డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది కంపెనీ..అంతేకాకుండా ఎక్స్‌టర్  15 ఇంచెస్ గల అల్లాయ్ వీల్స్‌తో లభిస్తోంది. 

బేస్‌ వేరియంట్స్‌లోని ఈ కార్లలో సింగిల్-పేన్ సన్‌రూఫ్ కూడా కంపెనీ అందించింది. ఈ మైక్రో SUV 1,710 MM వెడల్పుతో పాటు  3,815 MM పొడవును కలిగి ఉండబోతోంది. ఇందులో 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్‌తో పాటు ఆండ్రాయిడ్, యాపిల్‌ ఆటో ప్లే ఫీచర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది ఎలాంటి ప్రమాదాలైనా తట్టుకునే విధంగా అన్ని రకాల సేఫ్టీ ఫీచర్స్‌తో ఈ కారును రూపొందించినట్లు హ్యుందాయ్ తెలిపింది. ఇక అమ్మకాల విషయానికొస్తే ఇప్పటికే 11,000 ప్రి బుకింగ్స్‌ రావడంతో భవిష్యత్‌లో కూడా భారీగా విక్రయించబోతున్నట్లు తెలుస్తోంది. 

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also read: Dark Circles: డార్క్ సర్కిల్స్ మీ అందాన్ని పాడుచేస్తున్నాయా, ఈ చిట్కాలు పాటిస్తే చాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News