Red Rice Benefits: ఆధునిక జీవన శైలిని పాటించడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని చాలామంది ఆహార పదార్థాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. కొంతమంది అయితే తెల్ల అన్నానికి బదులుగా రోటీలను ఇతర ఆహారాలను తీసుకుంటున్నారు. అయితే వీటికి బదులుగా ప్రతిరోజు ఆహారంలో రెడ్ రైస్ తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని రక్షించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో ఆంథోసయనిన్స్ అనే పిగ్మెంట్స్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి వీటిని ప్రతిరోజు ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి.
రెడ్ రైస్‌లో శరీరానికి కావాల్సిన పోషకాలు, విటమిన్ బి, ఐరన్, మెగ్నీషియం ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు దీనితో వండిన రైస్ ని తినడం వల్ల జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. తరచుగా మలబద్ధకం, ఉబ్బరం, ఇతర పొట్ట సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు రెడ్ రైస్ ని తినడం వల్ల విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా శరీరాన్ని ప్రొటెక్ట్ చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?
తరచుగా మధుమేహం సమస్యలతో బాధపడుతున్న వారికి రక్తంలోని చక్కెర పరిమాణాలు పెరుగుతూ ఉంటాయి. అయితే ఇలాంటి సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు రెడ్ రైస్ ని తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు వేగంగా రక్తంలోని చక్కెర పరిమాణాలను నియంత్రించేందుకు కూడా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గుండె సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ రైస్ ను ఆహారంగా తీసుకోవాల్సి ఉంటుంది.
రెడ్ రైస్ లో ఉండే ఆంథోసయనిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ ను రాకుండా శరీరాన్ని రక్షించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ రైస్ తినడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రెడ్ రైస్ లో ఫైబర్ కూడా అధికంగా లభిస్తుంది. కాబట్టి ప్రతిరోజు రెండు పూటలా ఈ అన్నాన్ని తిని శరీర బరువును కూడా నియంత్రించుకోవచ్చు.
Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook