Sawan Shivratri 2023 date: హిందూ మతంలో శ్రావణ శివరాత్రికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ మాసం శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది. ప్రస్తుతం శ్రావణ మాసం నడుస్తోంది. ఇది రెండు నెలలపాటు ఉండనుంది. ఈ సంవత్సరం శ్రావణ శివరాత్రి జూలై 15న రాబోతుంది. ఇదే రోజున శివుడికి రుద్రాభిషేకం చేయడం వల్ల మీరు శుభఫలితాలు పొందుతారు. శ్రావణ శివరాత్రి 4 రాశుల వారికి స్పెషల్ గా ఉండబోతుంది. ఆ నాలుగు రాశులు ఏవో తెలుసుకుందాం.
శ్రావణ శివరాత్రి ఈ 4 రాశులకు వరం
సింహరాశి
సింహ రాశి వారికి శ్రావణ శివరాత్రి చాలా శుభప్రదంగా ఉంటుంది. మీపై భోలేనాథ్ ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి. కొత్త ఉద్యోగం ప్రారంభించడానికి ఇదే మంచి రోజు. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. వ్యాపారులు పెద్ద డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది.
కన్య రాశి
శ్రావణ శివరాత్రి కన్యా రాశి వారికి ప్రత్యేకంగా ఉండబోతుంది. ఈ సమయంలో మీరు శుభవార్తలు వింటారు. మీ జీతం పెరిగే అవకాశం ఉంది. మీకు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. మీరు దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయటపడతారు. మీ జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది.
ధనుస్సు రాశి
శ్రావణ మాసంలో ధనుస్సు రాశి వారికి శివుని అనుగ్రహం ఉంటుంది. మీరు కోరుకున్న లైఫ్ పార్టనర్ లభిస్తారు. వ్యాపారులు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.
మకరరాశి
మకరరాశి వారికి శ్రావణ శివరాత్రి మంచి ఫలితాలను ఇవ్వనుంది. మీరు కెరీర్ కు సంబంధించిన శుభవార్త వినే అవకాశం ఉంది. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది.
Also Read: Grah Gochar 2023: ఆగస్ట్‌లో కీలక గ్రహ సంచారాలు.. ఈ రాశులవారి కెరీర్ అదుర్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook