ప్రముఖుల చేతుల మీదగా 'కలియుగం పట్టణంలో' టైటిల్ పోస్టర్ విడుదల

నాని మూవీ వర్క్స్ అండ్ రామా క్రియేషన్స్ పతాకంపై విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరో - హీరోయిన్లుగా రమాకాంత్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతూ.. కాటం రమేష్, జి మహేశ్వరరెడ్డి, డాక్టర్ కె.చంద్ర ఓబుల్ రెడ్డిలు కలిసి సంయుక్తంగా ప్రొడక్షన్ నెంబర్ 1 గా ‘కలియుగం పట్టణంలో’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. అతిరథులు సమక్షంలో నేడు ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ లోగో పోస్టర్‌ను లాంచ్ చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 17, 2023, 06:03 PM IST
ప్రముఖుల చేతుల మీదగా 'కలియుగం పట్టణంలో' టైటిల్ పోస్టర్ విడుదల

KALIYUGAM PATTANAMLO: నాని మూవీ వర్క్స్ అండ్ రామా క్రియేషన్స్ పతాకంపై విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరో - హీరోయిన్లుగా రమాకాంత్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతూ.. కాటం రమేష్, జి మహేశ్వరరెడ్డి, డాక్టర్ కె.చంద్ర ఓబుల్ రెడ్డిలు కలిసి సంయుక్తంగా ప్రొడక్షన్ నెంబర్ 1 గా ‘కలియుగం పట్టణంలో’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. అతిరథులు సమక్షంలో నేడు ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ లోగో పోస్టర్‌ను లాంచ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ CM అంజద్ బాషా చేతుల మీదుగా కలియుగం పట్టణంలో సినిమా టైటిల్ పోస్టర్‌ రిలీజ్ చేశారు.  ఈ ఈవెంట్‌కు చిన్నప్ప రెడ్డి, టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గోవర్దన్ రెడ్డి, ఏ కే జెడ్ జువెల్లర్స్ చైర్మన్ అఫ్జల్ ఖాన్, ఒంటేరు శ్రీనివాస్ రెడ్డి, ఆర్ ఎల్ టీ గ్రూప్ చైర్మన్ అమీర్ బాబు, నాగార్జున స్కూల్ ఛైర్మన్ శివ శంకర్ రెడ్డి, ఏపీ ఇండస్ట్రీస్ అడ్వైజర్ రాజోలి వీర రెడ్డి, పొలిట్ బ్యూరో మెంబర్ రెడ్డప్పగిరి శ్రీనివాసుల రెడ్డి, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే లింగా రెడ్డి, రాజంపేట్ పార్లమెంట్ ఇంచార్జ్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

డిప్యూటీ సీఎం అంజద్ బాషా మాట్లాడుతూ.. ‘కొత్త చిత్రం ‘కలియుగం పట్టణంలో’ టైటిల్ లాంచ్‌కు విచ్చేసిన వారందరికీ ధన్యవాదాలు. విద్యార్థులకు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్న నాని గారు.. ఇప్పుడు మళ్లీ సినిమా రంగంలోకి అడుగుపెడుతున్నందుకు అభినందనలు. విద్యా రంగంలో అంచెలంచెలుగా ఎదిగిన నాని గారు సినిమా రంగంలో కూడా  అలానే ఎదగాలి. చలన చిత్ర పరిశ్రమ కడప వైపు, రాయలసీమ వైపు చూసేలా కచ్చితంగా చేస్తామ’ని అన్నారు.

నాని మాట్లాడుతూ.. ‘డబ్బుల గురించి నేను ఆలోచించలేదు.. డబ్బులు సంపాదించడానికి ఈ సినిమాను నిర్మించలేదు. మన కడప జిల్లాకి మంచి పేరు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాను తీశాను. ఇండస్ట్రీలోకి రావటం మా అమ్మకు ఇష్టం లేదు. సక్సెస్ కొట్టి మా అమ్మకి చూపించాలి అనుకున్నాను. ఆడిషన్స్‌ను ఉపయోగించుకుని సినిమాలో నటించబోతోన్న వారందరికీ మంచి భవిష్యత్తు ఉండబోతోంది. స్టూడెంట్స్ కోసం నేను ఏమైనా చేస్తాను. ఎవరికైనా ఆసక్తి ఉంటే మళ్లీ ఆడిషన్స్ పెడతాం. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండ’ని అన్నారు.

'త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తికానున్నాయి. షూటింగ్ కడప జిల్లాలోనే చేస్తాం. అందరి సహకారం ఉండాలని కోరుకుంటున్నాను' అని రమాకాంత్ రెడ్డి అన్నారు. 
'ఈ సినిమా నా కెరీర్‌లో ఎంతో ముఖ్యం. నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతఙ్ఞతలు. ఇది మంచి కొత్త స్క్రిప్ట్. ఇప్పుడే కథ గురించి పూర్తిగా చెప్పలేను. సినిమా అద్భుతంగా ఉండబోతోంది' అని హీరో విశ్వ కార్తికేయ అన్నారు 

Also Read: Team India: బుమ్రా, శ్రేయాస్ అయ్యర్ రీఎంట్రీకి రెడీ.. ఆ బౌలర్ మాత్రం ఎప్పుడంటే..!   

'ఇలా కడపలో మా సినిమా పోస్టర్‌ను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది.. మమ్మల్ని సపోర్ట్ చేసేందుకు వచ్చిన అతిథులకు థాంక్స్.. స్టూడెంట్స్ ప్యాషన్ తెలుసుకుని.. వారి కోసం నాని గారు ఇలా సినిమాను తీయడం చాలా గ్రేట్. నన్ను నమ్మి ఈ పాత్ర ఇచ్చిన దర్శకుడికి, నిర్మాతకు థాంక్స్ . విశ్వ కార్తికేయతో పని చేయడం ఆనందంగా ఉంది' అని హీరోయిన్ ఆయుషి పటేల్ అన్నారు. 

'కలియుగం పట్టణంలో పోస్టర్ లాంచ్ ఈవెంట్‌కు వచ్చిన వారందరికీ ధన్యవాదాలు..  ఈవెంట్‌ను ఇంత గ్రాండ్‌గా నిర్వహించినందుకు ఓబుల్ రెడ్డి (నాని) గారికి థాంక్స్' అని కాటం రమేష్ అన్నారు.
ఈ సినిమాకు అజయ్ అరసాద సంగీతాన్ని అందిస్తుండగా.. చరణ్ మాధవనేని కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. గ్యారీ బీ.హెచ్. ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని మేకర్లు తెలిపారు.

నటీనటులు: విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్
బ్యానర్ :నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ , 
నిర్మాతలు : డా.కందుల చంద్ర ఓబుల్ రెడ్డి,గడ్డం మహేశ్వర రెడ్డి, కాటం రమేష్
స్టోరీ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : రమాకాంత్ రెడ్డి
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : చరణ్ మాధవనేని 
సంగీత దర్శకుడు: అజయ్ అరసాద 
ఎడిటర్: గ్యారీ బి .హెచ్
లిరిక్స్:  చంద్రబోస్, భాస్కరభట్ల
స్టంట్స్ : ప్రేమ్ సన్
కొరియోగ్రాఫర్:  మొయిన్ మాస్టర్
పి. ఆర్. ఓ : సాయి సతీష్

Also Read: Wimbledon: వింబుల్డన్ విజేతగా వొండ్రుసోవా.. తొలి అన్ సీడెడ్ ఫ్లేయర్ గా రికార్డు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News