Viral Video Today: వైడ్ లైఫ్ ఫోటోగ్రాఫర్లు తీసిన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. జంతువులను వెంటాడి వేటాడుతున్న సింహాలకు సంబంధించినవి, నీటిలో ముసళ్ళకు సంబంధించిన వీడియోలే ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. సింహాలు ఆహారంగా అడవిలో ఉండే చిన్న చిన్న జంతువులను వేటాడుతూ ఉంటాయి. అయితే మొసల్లు కూడా నీటిలోకి దిగి ఏ జంతువునైనా సులభంగా వేటాడుతాయి. ప్రస్తుతం ఓ మొసలి జింకలను వేటాడుతున్న వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఈ వీడియో నెటిజన్లకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ మొసలి వెంటాడుతున్న వీడియోకు సంబంధించిన మరింత సమాచారం మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వీడియో వివరాల్లోకి వెళితే..ఓ జింకల గుంపు నది ఒడ్డును దాటేందుకు నీటిలో ఎంతో వేగంగా అవతలి ఒడ్డుకి పరిగెడతాయి. ఇది గమనించిన మొసలి మొసలి స్పీడ్ గా వాటి దగ్గరికి చేరుకొని..ఒక జింక వైపు మొసలి అమాంతం దూసుకెళ్లి వేటాడుతుంది. అయితే జింకలు నేల ప్రదేశంలో స్పీడ్ గా పరిగెత్తగలుగుతాయి. కానీ నీటిలో వేగంగా పరిగెత్త లేక పోవడం వల్ల జింక మొసలికి ఆహారంగా మారింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
నీటిలో ఉండే మొసల్లు ఎంతో శక్తివంతంగా ఉంటాయి. ఇవి జంతువులనే కాకుండా మనసులను సైతం ఎంతో సులభంగా వేటాడగలుగుతాయి. మనం తరచుగా సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. భారీ వర్షాల కారణంగా నదులు పొంగినప్పుడు మొసల్లు జనం నివసించే ప్రదేశాల్లోకి వచ్చి సంచారం చేయడం.. ఇలాంటి క్రమంలో మొసల్లు చాలామంది పై దాడి చేసి దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే మొసల్లు కేవలం నీటిలో ఉన్నప్పుడే శక్తివంతంగా ఉంటాయని, నీటికి బయట ఏ జంతువుని చూసినా భయపడతాయట.
ఈ వీడియోను వైల్డ్ లైఫ్ ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేశారు. అంతేకాకుండా "ఒక తల్లి తన బిడ్డ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ముసలికి ఆహారంగా మారింది" అని వీడియోకు క్యాప్షన్ కూడా రాశారు. నిజానికి ఆ రెండు జింకలు తల్లి బిడ్డలు.. నదీ దాటే క్రమంలో తన బిడ్డను అవతలి ఒడ్డుకు చేర్చేందుకు తల్లి కూడా పిల్ల జింక వెంట వెళ్ళింది. అయితే ఇదే క్రమంలో ఆ మొసలి దాడి చేసి వెంటాడింది.
Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి