Kodali Nani On Chadrababu Naidu: కుప్పంలో చంద్రబాబు గెలిచేది లేదని.. 2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరి ఎన్నికలు అవుతాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని జోస్యం చెప్పారు. కృష్ణాజిల్లా గుడివాడలో కొడాలి నాని మీడియాతో మాట్లాడారు.. ప్రాజెక్టుల పరిశీలన పేరుతో చంద్రబాబు విచిత్ర విన్యాసాలు చేస్తున్నారని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత రాష్ట్రంలో ఎక్కువ కాలం అధికారంలో ఉన్నది కాంగ్రెస్, టీడీపీలేనన్నారు. కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు దిక్కుమాలిన పనులు అన్ని చేశారని విమర్శించారు. ఎన్టీఆర్ కాళ్లు పట్టుకుని టీడీపీలో చేరారని అన్నారు. 1978 నుంచి 40 ఏళ్ల ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు కీలకంగా ఉన్నారని.. అయినా ఇన్నేళ్లలో ప్రాజెక్టులు ఎందుకు కట్టలేకపోయారని నిలదీశారు.
"పులిచింతల, గాలేరు-నగరి, తెలుగు గంగ, వెలుగొండను ఎందుకు పూర్తి చేయలేదు..? పోలవరానికి 100 కోట్ల రూపాయల పనులు ఎందుకు చేయలేయారు..? పోలవరానికి జాతీయ హోదా తెచ్చిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డిది. పోలవరం కాలువలు తవ్వుతుంటే.. దేవినేని ఉమా వంటి బ్రోకర్లతో కోర్టుల్లో కేసులు వేయించిన వ్యక్తి చంద్రబాబు. కేంద్రం కట్టాల్సిన జాతీయ ప్రాజెక్టును చంద్రబాబు ఎందుకు తీసుకున్నాడు..?
పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నాడని ప్రధాని మోదీనే చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు పనికి మాలిన పనులు చేసి.. అధికారం ఇస్తే ఇప్పుడు ప్రాజెక్టులు పూర్తి చేస్తానని మాయమాటలు చెబుతున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు ఒక్క పని కూడా చేయని 420 చంద్రబాబు. 10 కిలోమీటర్లు నడిచి జారుడుబల్లలా పప్పు లోకేష్ జారిపోతున్నాడు. చంద్రబాబు తన ఐదేళ్లలో గ్రాఫిక్స్‌లో పోలవరం కట్టాడు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు.. రూ.55వేల కోట్లు ఎందుకు తీసుకురాలేకపోయాడు..? పోలవరం ప్రాజెక్టు ఎందుకు కట్టలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని ప్రశ్నిస్తున్న వారు.. గతంలో ఎందుకు పూర్తి చేయలేకపోయారు..?" అని కొడాలి నాని ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పేవన్నీ సొల్లు కబుర్లే అని అన్నారు.తమ ప్రభుత్వంపై పిచ్చి వాడుగు మానకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మూడో విడత వారాహి యాత్ర చేయడం వల్ల ఎవరికీ అభ్యంతరం లేదన్నారు కొడాలి నాని. తమ ప్రభుత్వం తప్పుడు ఎత్తి చూపినా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై విమర్శలు చేసినా అభ్యంతరం లేదని.. కానీ చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేస్తే మాత్రం ఎవరినైనా రాజకీయంగా బట్టలూడదీసి రోడ్డుమీద నిలబెడతామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Also Read: Delhi AIIMS Fire Accident: ఢిల్లీ ఎయిమ్స్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఎమర్జెన్సీ వార్డులో మంటలు
Also Read: Rahul Gandhi: రాహుల్ గాంధీకి లైన్ క్లియర్.. పార్లమెంట్ సభ్యత్వం పునరుద్ధరణ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook