Best 2 Rotis For Weight Loss: ప్రస్తుతం బరువు పెరగడం సాధరణ సమస్యగా మారింది. ఆధునిక జీవనశైలికి అలవాటు పడే ప్రతి ఒక్కరూ శరీర బరువు పెరుగుతున్నారు. అయితే బరువు పెరగడం పెద్ద సమస్య కాకపోయిన దీని కారణంగా భవిష్యత్‌లో తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఊబకాయం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోయి గుండెపోటు పోటు అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎంత సులభంగా బరువు తగ్గితే అంతమంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే సులభంగా ఊబకాయం సమస్య నుంచి ఉపశమనం పొందడానికి తీసుకునే ఆహారాల్లో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది.
బరువు తగ్గే క్రమంలో తప్పకుండా ఆహారాలను డైట్ పద్ధతిలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ప్రతి రోజు ఆహారాలును తీసుకుంటూ.. వ్యాయామాలు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అయితే సులభంగా బరువు తగ్గడానికి చాలా మంది డైట్‌లో భాగంగా గోధుమలతో తయారు చేసిన రోటీలను తీసుకుంటారు. ఈ పిండితో తయారు చేసిన రోటీల కంటే చిరు ధాన్యాలతో చేసిన రొట్టెలను ప్రతి రోజు తీసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ కింది పిండిలతో తయారు చేసిన రోటీలను కూడా తీసుకోవచ్చు.
ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?a
మొక్కజొన్న రొట్టె:
బరువు తగ్గే క్రమంలో మొక్కజొన్న పిండితో తయారు చేసిన రొట్టెలను ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలపుతున్నారు. ఇందులో ఫైబర్ పరిమాణాలు అధిక మోతాదులో లభిస్తుంది. కాబట్టి ప్రతి రోజు డైట్‌లో తీసుకోవడం వల్ల సులభంగా శరీర బరువును తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.
రాగి పిండి రోటీలు:
రాగి పిండితో తయారు చేసిన జావా శరీరానికి చాలా మంచిది. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. శరీర బరువును తగ్గించుకోవాలనుకునేవారు ప్రతి రోజు డైట్‌లో భాగంగా రాగి పిండితో తయారు చేసిన రోటీలను తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు కొలెస్ట్రాల్‌ను కరిగించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండడానికి ప్రతి రోజు ఈ రాగి పిండితో తయారు చేసిన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి