YS Sharmila Challenges KCR Over Winning From Gajwel: గజ్వేల్ ఓటర్లు తన్ని తరిమేస్తారని దొరకు బాగా అర్థమైనట్టుంది. అందుకే ముందు జాగ్రత్తగా రెండో స్థానం నుంచి పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఎద్దేవా చేశారు. స్వయానా ముఖ్యమంత్రికే తన సొంత నియోజకవర్గంలో గెలుస్తాననే దమ్ము లేకపోవడం అనేది కేసీఆర్ పదేళ్ల దిక్కుమాలిన పరిపాలనకు నిదర్శనంగా వైఎష్ షర్మిల అభివర్ణించారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు అనడానికి సంకేతం. దొర ఇన్నాళ్ల పాటు గజ్వేల్ ప్రజలను కలిసింది లేదు. వాళ్ల గోసలు తెలుసుకున్నది లేదు. పేరుకు ముఖ్యమంత్రి నియోజకవర్గమైనా డబుల్ బెడ్ రూం ఇండ్లు రాకపాయే. దళితులకు దళిత బంధు పథకం ద్వారా వచ్చే ఆర్థిక సహాయం అందకపాయే. ఇక దొర గజ్వేల్ నియోజకవర్గంలో చూపెట్టే అభివృద్ధి అంతా ఖాళీ బిల్డింగులే అని ఎద్దేవా చేశారు.
గజ్వేల్ ఓటర్లు తన్ని తరిమేస్తారని దొరకు బాగా అర్థమైనట్టుంది. అందుకే ముందు జాగ్రత్తగా రెండో స్థానం నుంచి పోటీ.స్వయానా ముఖ్యమంత్రికే సొంత నియోజకవర్గంలో గెలుస్తాననే దమ్ము లేకపోవడం కేసీఆర్ పదేళ్ల దిక్కుమాలిన పరిపాలనకు నిదర్శనం. వచ్చే ఎన్నికల్లో BRS పార్టీకి డిపాజిట్లు కూడా రావు…
— YS Sharmila (@realyssharmila) August 21, 2023
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తాను రాష్ట్రానికే ముఖ్యమంత్రిని అన్న అహంకారంలో గజ్వేల్ నియోజకవర్గానికి తాను ఒక ఎమ్మెల్యేను అనే కనీస విషయం కూడా ఏనాడో మరిచిపోయిండు అని వైఎస్ షర్మిల మండిపడ్డారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు నిజంగానే దమ్ముంటే.. తన పరిపాలన మీద తనకు అంత నమ్మకమే ఉంటే.. సొంత నియోజకవర్గం గజ్వేల్ నుంచే గెలిచి చూపించాలని వైఎస్ షర్మిల సవాల్ చేశారు. గజ్వెల్లో గెలుస్తాననే నమ్మకం లేకపోవడం వల్లే రెండు నియోజకవర్గాల నుండి పోటీకి సిద్ధపడ్డారు అని వైఎస్ షర్మిల మండిపడ్డారు.
ఇది కూడా చదవండి : Chandrababu Meeting with Telangana TDP: తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో పోటీపై చంద్రబాబు క్లారిటీ
ఇటీవల గజ్వెల్ నియోజకవర్గం జగదేవ్ పూర్ మండలం తీగుల్ గ్రామానికి చెందిన దళితులు తమకు దళిత బంధు పథకం అందలేదని ఫిర్యాదు చేస్తూ, తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడాల్సిందిగా లేఖ రాశారని వైఎస్ షర్మిల దర్నాకు దిగిన సంగతి తెలిసిందే. తీగుల్ గ్రామం వెళ్లేందుకు షర్మిల ప్రయత్నించగా.. పోలీసులు ఆమె నగరంలోనే అడ్డుకున్నారు. దీంతో ఆమె తీగుల్ గ్రామస్తుల సమస్యలపై పోరాటం చేస్తూ లోటస్ పాండ్ వద్దే ఆందోళనకు దిగడం పతాక శీర్షికలకెక్కింది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక రాష్ట్రం నలుమూలలా పరిస్థితి ఏంటని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి : Mynampalli Hanmantha Rao: మైనంపల్లిపై కేసీఆర్ యాక్షన్ తీసుకుంటారా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి