సానియాను వేధించిన బంగ్లా క్రికెటర్

భారత టెన్నిస్ క్రీడాకారిణి, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ సతీమణి సానియా మీర్జాను బంగ్లాదేశ్ క్రికెటర్ షబ్బీర్ రెహ్మాన్ టీజ్ చేశారన్న వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Last Updated : Sep 2, 2018, 05:24 PM IST
సానియాను వేధించిన బంగ్లా క్రికెటర్

భారత టెన్నిస్ క్రీడాకారిణి, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ సతీమణి సానియా మీర్జాను బంగ్లాదేశ్ క్రికెటర్ షబ్బీర్ రెహ్మాన్ టీజ్ చేశారన్న వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సానియా భర్త షోయబ్ మాలిక్ అతనిపై ఫిర్యాదు చేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి.

బంగ్లాదేశ్ మీడియా కథనం మేరకు.. షోయబ్ మాలిక్, క్రికెట్ కమిటీ ఆఫ్ ఢాకా మెట్రోపోలీస్ (సీసీడీఎం) ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన నాలుగేళ్ల క్రితం బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్నప్పుడు జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. రిపోర్టుల ప్రకారం, బంగ్లా క్రికెటర్ షబ్బీర్.. ఆట జరిగేటప్పుడు మైదానంలో సానియాను వేధించాడు. దేశీవాలీ క్రికెట్ టోర్నమెంట్‌లో ఆడేందుకు షోయబ్ నాలుగేళ్ల క్రితం సానియాతో ఢాకాకు కలసి వచ్చాడు. భర్త షోయబ్‌ను ప్రోత్సహించేందుకు మైదానంలో ఉన్న సానియాను షబ్బీర్ టీజ్ చేశాడు.

కాగా ఓ అభిమానిపై దురుసుగా ప్రవర్తించాడన్న ఆరోపణలతో షబ్బీర్‌ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)ఆరు నెలలు పాటు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకుండా నిషేధం విధించింది. అంతేకాదు.. బీపీఎల్ (బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్) జరిగే సమయంలో అనుమతి లేకుండా హోటల్లో మహిళను తీసుకొచ్చినందుకు బోర్డు అతనిపై జరిమానా విధించింది.

Trending News