2023 Honda Hornet 2.0 Features: ఆన్ బోర్డ్ డయాగ్నస్టిక్స్ కి అనుగుణంగా హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) హార్నెట్ 2.0ని బైకుని లాంచ్ చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ అప్డేటెడ్ హార్నెట్ 2.0 బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.39 లక్షలుగా ఉంది. పైగా ఆకట్టుకునే గ్రాఫిక్స్ కూడా తోడయ్యాయి. అలాగే, ఫార్వార్డ్ లీనింగ్ ఏరోడైనమిక్ స్టైలింగ్, భారీ ఇంధన ట్యాంక్ డిజైన్ అలాగే మెయింటెన్ చేశారు. స్టైలింగ్ అంతా LED హెడ్‌ల్యాంప్, LED వింకర్లు , X ఆకారపు LED టెయిల్ ల్యాంప్ అమర్చారు. హార్నెట్ 2.0 లు టెన్-స్పోక్ అల్లాయ్ వీల్ డిజైన్, అల్యూమినియం ఫినిష్డ్ ఫుట్ పెడల్స్ ఉపయోగించారు.
2023 హార్నెట్ 2.0 బైక్ శక్తివంతమైన 184.40 cc, 4 స్ట్రోక్, సింగిల్-సిలిండర్ BSVI OBD2 నిబంధనలకు అనుగుణంగా PGM-FI ఇంజిన్ తో రూపొందింది. 12.70 kW పవర్ , 15.9 Nm గరిష్ట టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. OBD2 హార్నెట్ 2.0 ఉద్గార పనితీరును ప్రభావితం చేసే బహుళ సెన్సార్లు ఉన్నాయి. వాహనంలో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తితే.., వెంటనే వాహనం ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్‌పై అలర్ట్ చూపిస్తుంది.
అప్డేటెడ్ 2023 హార్నెట్ 2.0 బైక్ స్లిప్పర్ క్లచ్ కూడా ఉంది. బైక్ గేర్ అప్షిఫ్ట్లను ఇది ఈజీ అయ్యేలా చేస్తుంది. అంతేకాకుండా హార్డ్ డౌన్ షిఫ్టులలో వెనుక చక్రాల లాకప్ చేసి స్పీడ్ కంట్రోల్ చేస్తుంది. అధునాతన ఫుల్లీ డిజిటల్ లిక్విడ్ క్రిస్టల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ స్పీడోమీటర్, ఓడోమీటర్, టాకోమీటర్, బ్యాటరీ వోల్టమీటర్, ట్విన్ ట్రిప్ మీటర్లు, గేర్ పొజిషన్ ఇండికేటర్, సర్వీస్ డ్యూ ఇండికేటర్, క్లాక్ వంటి సమాచారాన్ని చూపిస్తుంది.
ఇది కూడా చదవండి : Ola S1 X Electric Scooters: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్‌కి భారీ డిమాండ్.. 2 వారాల్లోనే 75 వేల బుకింగ్స్
ఇది పగలు / రాత్రి మెరుగైన విజిబిలిటీ కోసం బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఉంది. హార్నెట్ 2.0 సింగిల్ ఛానల్ ABSతో డ్యూయల్, పెటల్ డిస్క్ బ్రేక్ అలారం. మోనో షాక్ రియర్ సస్పెన్షన్ కార్నర్ చేసేటప్పుడు స్థిరత్వంతో పాటు అద్భుతమైన రైడింగ్ ఎక్స్‌పీరియెన్స్ అందిస్తుంది.
ఇది కూడా చదవండి : Cars Launching In September 2023: ఈ సెప్టెంబర్‌లో లాంచ్ అవుతున్న కొత్త కార్లు, వాటి ఫీచర్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి