Venus direct Movement in Cancer 2023: అష్టగ్రహాల్లో శుక్రుడు కూడా ఒకడు. ఇది చాలా ప్రకాశవంతమైన గ్రహం. ఆస్ట్రాలజీలో శుక్రుడిని శుభప్రదమైన గ్రహంగా భావిస్తారు. ఇతడి అనుగ్రహం ఉన్నవారికి దేనికీ లోటు ఉండదు. ప్రస్తుతం శుక్రుడు కర్కాటక రాశిలో తిరోగమనంలో ఉన్నాడు. రేపు అంటే సెప్టెంబరు 04 నుండి శుక్రుడు నేరుగా నడవనున్నాడు. శుక్రుడు ప్రత్యక్ష సంచారం ఏయే రాశులవారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం.
మిథునం: శుక్రుని గమనంలో మార్పు మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. మీ పనిని బాస్ మెచ్చుకుంటాడు. మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. మీ ఆదాయం పెరుగుతుంది. వ్యాపారస్తులు మంచి లాభాలను పొందుతారు.
వృశ్చికం: మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీరు ఊహించని ప్రయోజనం పొందుతారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి.
మేషం: శుక్రుని ప్రత్యక్ష సంచారం మేష రాశి వారికి శుభఫలితాలను ఇస్తుంది. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీరు ధ్యానం చేయడం వల్ల ప్రయోజనం పొందుతారు.
Also Read: Saturn Retrograde 2023: శని తిరోగమనంతో ఈ 3 రాశులకు మరో 72 రోజులు మహర్దశే
వృషభం: వృషభ రాశిని పాలించే గ్రహం శుక్రుడు. కావున శుక్రుని సంచారం మీకు చాలా లాభాలను ఇస్తుంది. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. దీంతో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మీకు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది.
Also Read: Shani Vakri 2023: దీపావళికి ముందు వారం నుంచే ఈ రాశులవారికి ఊహించని సంపద లభించబోతోంది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి