Railway Jobs Updates: ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా చాలా మంది రేయింబవళ్లు కష్టపడి ప్రిపేర్ అవుతుంటారు. ఇక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు అయితే ఇంకా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అత్యధిక ఉద్యోగాలు రైల్వే డిపార్ట్‌మెంట్‌లోనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా 12 లక్షల మందికి పైగా ఉద్యోగాలు కల్పిస్తోంది. గ్రూప్ A, B, C, D కోసం రైల్వే శాఖ రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా దాదాపు 11 రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు ఖాళీలను భర్తీ చేస్తున్నాయి. తాజా ఉద్యోగ నియామకాల కోసం ఎప్పటికప్పుడు రైల్వో బోర్డు వెబ్‌సైట్ చెక్ చేస్తూ ఉండాలి. రైల్వే శాఖ ఏ పోస్టులను ఎలా భర్తీ చేస్తారో ఇక్కడ తెలుసుకోండి..
గ్రూప్ ఏ పోస్టులకు ఆర్ఆర్‌బీ గ్రూప్ ఏ పరీక్షను నిర్వహిస్తారు. గ్రూప్-ఎ పోస్టులకు అర్హత సాధించాలంటే.. అభ్యర్థులు యూపీఎస్‌సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ, మెయిన్స్ పరీక్ష, ప్రిలిమినరీ పరీక్ష అన్నీ యూపీఎస్‌సీలో నిర్వహిస్తారు. టెక్నికల్, నాన్ టెక్నికల్ రెండూ ఈ కేటగిరీ కింద ఉంటాయి. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్, ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్, కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇక రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు గ్రూప్-బి పోస్టులకు పరీక్షలు నిర్వహించదు. ఈ పోస్టులను ప్రమోషన్ ప్రాతిపాదికన భర్తీ చేస్తుంది.
గ్రూప్ సి పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్‌ను నిర్వహిస్తుంది రైల్వే శాఖ. ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన పూర్తి సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో ఉంటుంది. రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్ఆర్‌సీ) డివిజనల్ స్థాయిలో గ్రూప్ డి పోస్టులను భర్తీ చేస్తుంది. షూటర్, స్వీపర్, ట్రాక్‌మ్యాన్, ప్యూన్, ట్రాకర్ వంటి ఉద్యోగాలు ఉన్నాయి.
Also Read: AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 20 నుంచి, ఎజెండా ఏంటంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి