Surya Nakshatra Transit 2023: కొన్ని గ్రహాలు రాశులు మారడమే కాకుండా కొన్ని సందర్భాల్లో నక్షత్రాలు కూడా మారతాయి. సూర్యగ్రహం సెప్టెంబర్ 14వ తేదిన తెల్లవారుజామున 03:38 గంటలకు ఉత్తర ఫాల్గుణి నక్షత్రంలోకి సంచారం చేయబోతోంది. అయితే ఈ నక్షత్రాన్ని సూర్యుడు పరిపాలిస్తాడు. 12 రాశుల స్థానాల్లో 27 స్థానంలో సూర్యుడు ఉత్తర ఫాల్గుణి నక్షత్రంలో ఉన్నప్పుడు వ్యక్తుల జీవితాల్లో అనేక రకాల మార్పులు వస్తాయి. ఈ ప్రత్యేక ప్రభావం కారణంగా కొన్ని రాశులవారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.చ అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మిథునరాశి
ఉత్తర ఫాల్గుణి నక్షత్రంలో సూర్యగ్రహం సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ సమయంలో వ్యాపారాలు చేసేవారు ఒక చోటి నుంచి మరో చోటికి ప్రయాణం చేసి అనే రకాల ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారికి ఇది ప్రత్యేక సమయంగా భావించవచ్చు. ఉద్యోగాలు చేసే ఈ రాశివారు ప్రమోషన్స్ కూడా పొందే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. ఎప్పటి నుంచో ఆర్థిక సమస్యలతో బాధపడేవారికి ఈ సమయంలో సులభంగా ఉపశమనం లభిస్తుంది.
చదవండి : Central Govt Schemes: కేంద్ర ప్రభుత్వం సూపర్ స్కీమ్.. ఉచితంగా కుట్టు మిషన్లు.. అసలు విషయం ఇదే..!
సింహ రాశి:
సూర్యగ్రహం నక్షత్రంలో మార్పులు రావడం కారణంగా సింహరాశివారిపై కూడా ప్రత్యేక ప్రభావం పడుతుంది. వీరికి ఈ సమయంలో సామాజిక ప్రతిష్ట కూడా పెరుగుతుంది. అంతేకాకుండా వీరు ఈ సమయంలో సోమరితనంగా కూడా మారే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. దీంతో పాటు వీరు ఉద్రేకానికి గురవుతారు. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా సింహ రాశివారు ఈ సమయంలో తప్పకుండా విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది.
ధనుస్సు రాశి:
సూర్యగ్రహం ఉత్తర ఫాల్గుణి నక్షత్రంలోకి సంచారం చేయడం వల్ల ధనుస్సు రాశి వారిపై కూడా ప్రత్యేక ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వీరు ఈ సంచారం కారణంగా భవిష్యత్‌లో ఊహించని లాభాలు పొందుతారు. దీంతో పాటు వ్యాపారాలు చేసేవారికి సమజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. అంతేకాకుండా కీర్తి కూడా రెట్టింపు అయ్యే ఛాన్స్‌లు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
చదవండి : Central Govt Schemes: కేంద్ర ప్రభుత్వం సూపర్ స్కీమ్.. ఉచితంగా కుట్టు మిషన్లు.. అసలు విషయం ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.