Vishwakarma Jayanti 2023: 50 ఏళ్ల తర్వాత అరుదైన యోగాలు, విశ్వకర్మ పూజతో అపారమైన ధనం పొందండి!

Vishwakarma Jayanti Puja 2023: 50 ఏళ్ల తర్వాత అరుదైన ప్రత్యేక యోగాలు విశ్వకర్మ జయంతి రోజున ఏర్పడబోతున్నాయి. ఈ రోజు స్వామివారికి ప్రత్యేక సమయాల్లో పూజలు చేయడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అంతేకాకుండా అపారమైన ధన లాభాలు పొందుతారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 17, 2023, 10:27 AM IST
Vishwakarma Jayanti 2023: 50 ఏళ్ల తర్వాత అరుదైన యోగాలు, విశ్వకర్మ పూజతో అపారమైన ధనం పొందండి!

 

Vishwakarma Jayanti Puja 2023: భాద్రపద శుక్ల పక్షంలో వచ్చే కన్యా సంక్రాంతి రోజునే భారతదేశ వ్యాప్తంగా విశ్వకర్మ జయంతి జరుపుకుంటారు. ఈ రోజే కన్యా సంక్రాంతి కావడంతో దేశవ్యాప్తంగా భక్తులంతా విశ్వకర్మ జయంతిని జయంతిని జరుపుకుంటున్నారు. విశ్వకర్మ బ్రహ్మదేవుని 7వ కుమారుడు సృష్టికి మొదటి వాస్తుశిల్పిగా పరిగణిస్తారు. విశ్వకర్మ కన్యా సంక్రాంతి రోజున జన్మించాడు. అందుకే భక్తులంతా ఈ రోజు ఘనంగా విశ్వకర్మ దేవుడికి పూజా కార్యక్రమాలు చేస్తారు. ఈ రోజు విశ్వకర్మ ఆరధాన చేయడం వల్ల వ్యక్తుల జీవితాల్లో సమస్యలన్నీ దూరమవుతాయి. అంతేకాకుండా జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. 

ఈ సంవత్సరం విశ్వకర్మ పూజ చాలా ప్రత్యేకమైనదిగా పరిగణిస్తున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే 50 ఏళ్ల తర్వాత ఈ రోజు ప్రత్యేక తిథులు, గ్రహాల అనుకూల యాదృచ్ఛిక సంఘటనలు చోటు చేసుకోబోతోంది. కాబట్టి ఈ రోజు విశ్వకర్మను పూజించడం వల్ల పుణ్యం రెట్టింపు అవుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ ప్రత్యేక రోజున స్వామివారిని ఎలా పూజించాలో, పూజించడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  

50 ఏళ్ల తర్వాత అరుదైన యాదృచ్చికం:
సెప్టెంబర్ 17న సర్వార్థ సిద్ధి యోగం, అమృత యోగం, ద్విపుష్కర యోగం, బ్రహ్మ యోగం ఇలా నాలుగు యోగాలు ఒకే సారి ఏర్పడబోతున్నాయి. అయితే ఇలాంటి యోగాలు గత 50 ఏళ్ల క్రితం ఏర్పడ్డాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఈ రోజున విశ్వకర్మను భక్తి శ్రద్ధలతో పూజించి ఉపవాసాలు పాటించడం వల్ల కోరకున్న కోరికన్నీ సులభంగా నెరవేరుతాయి. 

ప్రత్యేక యోగాల సమయాలు:
సర్వార్థ సిద్ధి యోగం సెప్టెంబర్ 17 ఉదయం 06:07 నుంచి 10:02 వరకు ఉంటుంది. ఆ తర్వాత ద్విపుష్కర యోగం సెప్టెంబర్ 17 ఉదయం 10:02 నుంచి1:08 వరకు ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. దీని తర్వాత  బ్రహ్మయోగం ఏర్పడుతుంది. ఈ యోగం  ఉదయం 04:13 నుంచి సెప్టెంబర్ 18వ తేదీ ఉదయం 04:28 వరకు ఉండబోతోంది. అమృత సిద్ధి యోగం సెప్టెంబర్ 17వ తేదీ ఉదయం 06:07 నుంచి 10:02 వరకు ఉంటుంది. ఈ సమయాల్లో విశ్వకర్మను పూజించించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. 

Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News